ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో రసాయన పరిశ్రమల్లో గ్యాస్ లీక్ కావడం.. పేలుడు సంబవించడం లాంటివి జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పినా కొంత మంది యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. తాజాగా ఏలూరు అక్కిరెడ్డి గూడెంలో ఉన్న రసాయన పరిశ్రమలో పేలుడు సంబవించింది. ఈ పేలుడు ధాటికి అక్కడ ఉన్న ఆరుగురు చనిపోగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే..
అక్కిరెడ్డి గూడెంలో ఉన్న రసాయన పరిశ్రమలో పేలుడు విషయం గురించి తెలుసుకున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ పోరస్ కెమికల్ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు తెలిపారు. పేలుడు ప్రమాదంలో తీవ్ర గాయపడ్డ క్షతగాత్రులను హాస్పిటల్ లో హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిశ్రమలను విషయంలో ఉపేక్షించేది లేదని అన్నారు. ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు.. ఒకవేళ పరిశ్రమ యాజమాన్యం తప్పు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కుటుంబాలకు సభ్యులకు ప్రభుత్వం తరుపు నుంచి రూ.25 లక్షలు, కంపెనీ తరఫున రూ.25 లక్షలు.. మొత్తంగా రూ.50 లక్షల పరిహారాన్ని అందజేస్తామని ఆమె తెలిపారు.
ఏలూరు జిల్లా ముసునూరు(మ)అక్కిరెడ్డి గూడెంలోని కెమికల్ ఫ్యాక్టరీ లో జరిగిన అగ్ని ప్రమాదానికి గురైన క్షతగాత్రులను @AndhraPradeshHM @VanitaTaneti, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్,దెందులూరు MLA కొఠారు అబ్బాయి చౌదరి,JC పి. అరుణ్ బాబు విజయవాడ గొల్లపూడి ఆంధ్ర హాస్పటల్ లో పరామర్శించారు pic.twitter.com/g6KbVk5NRM
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) April 14, 2022