సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంతమంది సామాన్యులు తమ టాలెంట్ తో రాత్రికి రాత్రే సెలబ్రెటీాలు గా మారిపోతున్నారు. మరికొంతమంది తమ వింత ప్రదర్శనలు, కాంటవర్సీలు క్రియేట్ చేస్తూ పబ్లిసిటి తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ ఒకరు.
దేశంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు సెలబ్రెటీలుగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తమ టాలెంట్ తో రాత్రికి రాత్రే స్టార్స్ గా మారిన వారు ఉన్నారు. కొంతమంది కామెడీ, డ్యాన్స్ ఇతర టాలెంట్ చూపిస్తే.. కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ పాపులర్ అయిన వాళ్లు ఉన్నారు అలాంటి వారిలో శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ ఒకరు.
శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్.. మనోడి బిల్డప్ చూస్తే మామూలుగా ఉండదు. స్టార్ హీరోలకు తాను బెస్ట్ ఫ్రెండ్ అని.. హీరోయిన్లు చాలా మంది తనతో సినిమా తీయాలని ఉవ్విళ్లూరుతుంటారని చెబుతుంటాడు. ఒకప్పుడు స్టార్ హీరోలు నటించి బ్లాక్ బస్టర్ మూవీలన్నీ తాను నటించాల్సినవే.. కాకపోతే తాను త్యాగం చేయడం వల్ల వేరే హీరోలు ఛాన్స్ దక్కించుకున్నారని అంటాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా ఒక్కరేమిటి యంగ్ స్టార్స్ తనను బ్రతిమలాడితే తనకు వచ్చిన సినిమా ఛాన్సులు వారికి వదిలేశానని చెబుతాడు. అలా తాను ఎన్నో సాక్రిఫైజింగ్ చేశాడు కనుకనే తనను శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ అంటారని పలు యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో చెబుతుంటాడు. ఓ ఇంటర్వ్యూలో సునిశిత్.. జూ.ఎన్టీఆర్ గురించి కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.
ఓ ఇంటర్వ్యూలో సునిశిత్ మాట్లాడుతూ.. తనకు జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్ అని.. అతను ఎంత పెద్ద హీరో అయినా ఫోర్న్ మూవీస్ ఉన్నాయన్న విషయం తనకు ఒక్కనికే తెలుసు.. హీరో సునిశిత్ ఒక్కడికే తెలుసు.. అది నేను ఒక్కడినే చెప్పగలను అంటూ మరోసారి కోతలు, కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశఆడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే సునిశిత్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిర్రెత్తుకొచ్చిన రామ్ చరణ్ ఫ్యాన్స్ సునిశిత్ ని పట్టుకొని చితక్కోట్టారు. మీడియా ముందు అతనిచే క్షమాపణలు కూడా చెప్పించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సునిశిత్‌ను ఏ రేంజ్ లో ఉతికి ఆరేస్తారో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి సునిశిత్‌ను ఎన్టీఆర్ అభిమానులు క్షమించి వదిలేస్తారో.. చెర్రీ ఫ్యాన్స్ లా చితక్కొడతారో చూడాలి.
monna #RamCharan fans dengindi saripole eediki ipudu malli #JrNTR ni gelkutunadu 😐 pic.twitter.com/TL244xaaTu
— JORDAN ✊🏻 (@hrudayjordan) May 17, 2023