AP High Court : ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఏకంగా 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఐఏఎస్ అధికారులు విజయ్ కుమార్, శ్యామలరావు, జికే ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చిన వీరభద్రుడు, ఎంఎం నాయక్‌లకు కోర్టు రెండు వారాల జైలు శిక్ష విధించింది. అయితే, ఎనిమిది మంది అధికారులు హైకోర్టును క్షమాపణలు కోరటంతో కోర్టు జైలు శిక్షను తప్పించి, సేవా కార్యక్రమాలకు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒక రోజు వెళ్లి సేవ చేయాలని స్పష్టం చేసింది.
ఓ సంవత్సరం పాటు ఇలా హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని, విద్యార్ధుల మధ్యాహ్నం, రాత్రి భోజన ఖర్చులు, ఒక రోజు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశించింది. కాగా, గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వ పాఠశాలలలోనుంచి తీసేయాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. అయితే, హైకోర్టు ఉత్తర్వులను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణగా భావించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన హిజ్రాలు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.