గత కొన్ని రోజులుగా ఏపిలో పీఆర్సీ రగడ కొనసాగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు చర్చలు జరిగినా సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో పీఆర్సీ, ఇతర డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ప్రకటించిన కార్యాచరణలో భాగంగా నేడు ఛలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులు వేలాదిగా తరలివచ్చారు. ఉద్యోగులను అడ్డుకునేందుకు సర్కారు విఫల ప్రయత్నం చేసినా.. జనసంద్రంలా మారిన బెజవాడ నగరాన్ని చూస్తే అర్థమవుతోంది. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు అమలు చేసే ప్రయత్నం చేసినా, ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. దాంతో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యోగులతో క్రిక్కిరిసిపోయింది.
ఇది చదవండి : పేద విద్యార్థుల కోసం తన 39 ఏళ్ళ సంపాదన విరాళంగా..!
మొత్తానికి అనుకున్నట్లుగానే ఉద్యోగులు విజయవాడ చేరుకుని కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ఛలో విజయవాడ సక్సెస్ అయిందని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. అంతేకాదు ఉద్యమ మరింత బలోపేతం అవుతుందని.. పీఆర్సీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎల్లుండి నుంచి పెన్ డౌన్ చేయబోతున్నట్లుగా.. సర్కార్ కు అల్టిమెటం జారీ చేశారు. ఇప్పటికే ఈనెల 7వ తేదీ నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తున్నట్లు నోటీసులు కూడా ఇచ్చారు. మరి ఈ విషయం పై ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.