గత కొన్ని రోజులుగా ఏపిలో పీఆర్సీ రగడ కొనసాగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు చర్చలు జరిగినా సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో పీఆర్సీ, ఇతర డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ప్రకటించిన కార్యాచరణలో భాగంగా నేడు ఛలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులు వేలాదిగా తరలివచ్చారు. ఉద్యోగులను అడ్డుకునేందుకు సర్కారు విఫల ప్రయత్నం చేసినా.. జనసంద్రంలా మారిన బెజవాడ నగరాన్ని చూస్తే అర్థమవుతోంది. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు అమలు చేసే ప్రయత్నం చేసినా, ఉద్యోగులు […]