ప్రభుత్వ పాఠశాలలంటే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం, బోధన సరిగా ఉండదు, తరగతి గదులు కూడా అంతంత మాత్రమే అన్నదేగా మీ మనుసులో ఉన్నది. అయితే ఈ ప్రభుత్వ పాఠశాలను చూడండి. కార్పొరేట్ స్కూల్స్‌ని కాదు కదా! యూనివర్సిటీలనే తలదన్నేలా ఉంది.
ఇప్పటివరకూ ప్రభుత్వ పాఠశాలలంటే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం, బోధన సరిగా ఉండదు, తరగతి గదులు కూడా అంతంత మాత్రమే. అన్నిటికీ మించి సౌకర్యల కొరత. ఇది అందరిలో ఉండే భావన. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్‌కి ఆదర్శంగా నిలుస్తున్నాయి. భావి భారతావనిని తీర్చిదిద్దాలంటే పాఠశాల విద్య నుంచే సాధ్యమవుతుంది కనుక ప్రభుత్వాలు వీటిపైనే శ్రద్ధ పెడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మన బడి – నాడు నేడు’ స్కీమ్ పాఠశాలల రూపు రేఖలు మార్చేసిందని చెప్పాలి.
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మన బడి- నాడు నేడు’ స్కీమ్ ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చిందనడానికి ఈ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల ఒక ప్రత్యక్ష ఉదాహరణ. సరికొత్తగా, ఆకర్షణీయంగా కార్పొరేట్ స్కూల్స్‌ని తలదన్నేలా ఈ ప్రభుత్వ పాఠశాల ఉంది. చెప్పుకోవడానికి వీటిని కేంద్రం నిర్వహిస్తున్నా, దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క ఏకలవ్య స్కూల్ ఈ స్థాయిలో లేదు. షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశ్యంతో కేంద్రం ఈ స్కూల్స్‌ని ప్రవేశపెట్టింది. మొదట కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను స్థాపించడానికి రూ. 30 లక్షల గ్రాంట్ ఇస్తుంది. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో పాఠశాలకు రూ.30 లక్షల వరకు మంజూరు చేస్తుంది. అదనపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఈ నిజాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లక్కవరం గ్రామంలో ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను చూస్తే.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏ ఒక్క పక్కకి అయినా సరిపోతాయా అన్న సందేహం కలగక మానదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ స్కూలు కార్పొరేట్ స్కూల్స్‌ని కాదు కదా! యూనివర్సిటీలనే తలదన్నేలా ఉంది. దీనికి కాసింత పచ్చదనం తోడైతే ఏ కార్పోరేట్ స్కూల్ కూడా దీనికి సాటిరాదు. మారేడుమిల్లి నుండి భద్రాచలం వెళ్ళేదారిలో చింతూరు మండలానికి 20 కీ.మీ దూరంలో ఉన్న లక్కవరం గ్రామంలో ఈ స్కూల్ ఉంది. ప్రస్తుతం 300 మంది విద్యార్థులు ఈ స్కూల్ లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలను మీరూ తిలకించి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.