‘ప్రేమ’ అనేది రెండు అక్షరాల పదం. అయితే ఈ ప్రేమ కారణంగా అనేక ఘటనలు జరుగుతుంటాయి. కొందరు అయితే ప్రేమ మైకంలో ఏమి చేస్తున్నాం అనే సంగతే మరచి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తింస్తుంటారు. ఇది కేవలం అబ్బాయిలకే అనుకుంటే పొరపాటు. అమ్మాయిల్లో కూడా కొందరు ఈ రకం వారు ఉన్నారు. తాజాగా ఓ యువతి తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలంటూ రోడ్డుపై రచ్చ చేసింది. ప్రియుడి మోజులో పడి తల్లిదండ్రులపై చిందులేసింది. ఈ ఘటన అనంతపురంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రాంతానికి చెందిన ఓ యువతి విజయనగరంలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఒంగోలు కు చెందిన యువకుడితో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇంతలోనే విషయం ఇంట్లో తెలిసి యువతిని పెద్దలు మందలించారు. చచ్చినా, బ్రతికినా ప్రేమించినోడితోనేనని తెగేసి చెప్పి ఒంగోలు వెళ్లింది. అక్కడ ప్రతిఘటన ఎదురవడంతో వెనక్కు అనంతపురం వచ్చింది. తాను ప్రేమించిన ఒంగోలు యువకుడితో పెళ్లి చేయాలంటూ గురువారం అనంతపురం పట్టణంలోని “సఖి” సెంటర్‌లో ఆ యువతి హల్‌చల్ చేసింది. తల్లిదండ్రులను చూడగానే రగిలిపోవడమే కాకుండా కౌన్సెలింగ్ నిర్వాహకులకు సహకరించకుండా దాడికి యత్నించింది.
తాను చెప్పిందే రాసుకోవాలంటూ మీడియా ప్రతినిధులపై హుకుం చేస్తూ వీరంగం సృష్టించింది. . ప్రేమించినోడి కోసం ఆ యువతి రెండు చేతులపై కోసుకున్న గాయాలే కనిపిస్తున్నాయి. తాను ప్రేమించినోడితో పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తూ ఆస్పత్రిపై నుంచి దూకేస్తానంటూ పారిపోయేందుకు యత్నించింది.అడ్డుకోబోయిన ఏఎస్‌ఐ గోవిందమ్మ, సఖి సెంటర్ మేనేజర్ శాంతామణి, సిబ్బందిపై ఎదురు దాడికి దిగింది. చేసేది లేక ఆ అమ్మాయిని ఓ గదిలో పెట్టి గడియ బిగించారు. ఆ యువతి ఆవేశంతో ఒక్కసారిగా తలుపులను గట్టిగా తన్నడంతో గడియతో సహా ఊడొచ్చాయి. భయభ్రాంతులకు గురైన అధికారులు “దిశ” పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.