ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ విధుల్లో ఉండగానే తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ విధుల్లో ఉండగానే తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన మర్రిపూడి వెంకటేశ్వర్లు (35) అనే వ్యక్తి ఒంగోలు పట్టణంలో రాజాపానగల్ లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే, వెంకటేశ్వర్లు ఎప్పటిలాగే సోమవారం కూడా విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లు తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వెంకటేశ్వర్లు బలవన్మరణానికి పాల్పడ్డాడని అందరూ భావిస్తున్నారు.