Acham Naidu: ఏపీలో అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీడీపీ మరింత పగడ్బంధీగా సిద్ధమవుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రజల్లోకి వాయు వేగంతో దూసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులతో తనకు ప్రాణ హాని ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఎండగట్టే క్రమంలో తాను విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నానని,
ప్రస్తుతం కల్పిస్తున్న 1+1 భద్రతను 4+4కు పెంచాలని కోరారు. అంతేకాకుండా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభా పక్ష ఉపనేతగా వ్యవహరిస్తున్నందున తాను కోరిన అదనపు భద్రత కల్పించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. మరి, డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Narayana: నారాయణ దంపతుల అరెస్ట్‌పై ఏపీలో రాజకీయ రగడ..