సమాజంలో పోలీసులు అంటే ఎంతో గౌరవం ఉంటుంది.. ప్రజలన శాంతి భద్రతలు, ఆస్తులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటూ వారి రక్షణ కోసం అహర్శిశలూ శ్రమిస్తుంటారు.
సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ.. ప్రజల జీవితాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఉండేందుకు ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎక్కడ అల్లర్లు, విధ్వంసాలు జరగకుండా అక్రమార్కులకు ఆటలు కట్టివేసేవారు పోలీసులు. పోలీసులు అంటే ఫిట్ గా ఎంతో యాక్టీవ్ గా ఉంటారు. దొంగలు, కేటుగాళ్లను చేజింగ్ చేసి పట్టుకొని జైళ్లో పెడుతుంటారు. కానీ ఇటీవల కొంతమంది పోలీసులు ఫిట్ నెస్ కోల్పోయి పొట్టలతో దర్శనం ఇవ్వడంపై ఓ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏ రాష్ట్రం అంటారా? వివరాల్లోకి వెళితే..
ఏ రాష్ట్రంలో అయినా సరే పోలీసులు అంటే శాంతి భద్రతలు కాపాడటానికి అవసరమైతే తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఉంటారు. పోలీసులు ఎప్పుడు ధృడంగా, ఫిట్ గా ఉంటారు. అలా ఉండటం వల్ల నేరస్తుల పాలిట సింహ స్వప్నంగా ఉంటారు. కానీ ఈ మద్య పోలీసులు పూర్తిగా ఫిట్ నెస్ కోల్పోయి లావు కావడం.. పొట్టలు పెంచుకొని ఉండటం గమనిస్తున్నాం. ఇలా పొట్టలు పెంచుకొని స్థూలకాయంగా మారుతున్న పోలీసులకు ఫిట్ నెస్ పై అవగాహన పెంచేందుకు అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక అసోం పోలీస్ శాఖలో సిబ్బంది తమ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాలని, స్థూలకాయులు బరువు తగ్గాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.
ఇక సీఎం సూచనలతో రాష్ట్ర డీజీపీ జీపీ సింగ్.. ‘సీఎం ఆదేశాల మేరకు ఐపీఎస్, ఏపీఎస్ అధికారులతో సహా అన్ని విభాగాల్లో పని చేస్తున్న పోలీసులు బాడీ మాస్ ఇండెక్స్ ని నమోదు చేయాలని నిర్ణయించాం.. ఆగస్టు 15 వరకు అందరికీ 90 రోజులు.. అంటే మూడు నెలల సమయం ఇచ్చి తర్వాత బీఎంఐ లెక్కింపు చేపడతాం.. స్థూలకాయం బీఎంఐ కేటగిరిలో ఉన్నారు తమ బరువు తగ్గించుకోకపోతే.. మరో మూడు నెలలు గడువు ఇస్తాం.. అప్పటికీ ఫిట్ కాకపోతే థేరాయిడ్ సమస్యలు ఉన్నవారు మినహా… మిగతా వారందరికీ స్వచ్ఛంద పదవీ విరమణ ఆప్షన్ ఇస్తాం.. అస్సాం డీజీపీ ఆగస్టు 16న మొదటి బీఎంఐ గా లెక్కింపునకు హాజరు అవుతారు అని ’ ట్విట్ లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ జీపీ సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అసోం లో 70 వేల మంది సిబ్బంది ఉన్నారని.. పోలీస్ శాఖలో 680 మంది స్థూలకాయులను ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఈ జాబితాను సిద్దం చేశామని.. అధిక బరువుతో వీరంతా జాబ్ కి పనికిరారు అని తేల్చేశామని అన్నారు. ఫిట్ గా మారేందుకు మూడు నెలలు అవకాశం ఇచ్చామని తెలిపారు. సమాజంలో శాంతి భద్రతల, పౌరులను రక్షించే బాధ్యత ఉన్నవారు తమ ఫిట్ నెస్ గురించి ముందు చూసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు పోలీసులు తమ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతున్నారని ఆయన అన్నారు.