మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ గురించి తెలియని వారు ఉండరు. ఆయన క్రికెట్ మైదానంలో బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టేవి. 1999లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి తర్వాత రాజకీయాల్లో కి వెళ్లారు. కేవలం రాజకీయాల్లోనే కాదు.. వెండితెర, బుల్లితెరపై కూడా తన సత్తా చాటారు.
భారత క్రికెట్ జట్టులో మెరుపులు మెరిపించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు నవజ్యోత్ సింగ్ సిద్దూ. 1999లో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఓ వైపు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే బుల్లితెర, వెండితెరపై తన సత్తా చాటారు. సిద్దూ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా పని చేశాడు. మొదటి నుంచి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఏదో ఒక వివాదాస్పద వార్తల్లో ఉంటారు. గతంలో తన ప్రత్యర్థుల చే ప్రాణ భయం ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సిద్దూ ఇంట్లో ఓ అజ్ఞాత వ్యక్తి కలకలం సృష్టించడంతో డీజీపీకి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..
నవజ్యోత్ సింగ్ సిద్దూ క్రీడారంగంలో తనదైన ప్రతిభ చాటుకొని కోట్ల మంది అభిమానం పొందారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవల ఓ ఘర్షణ కేసు విషయంలో సిద్దూకి సుప్రీం కోర్లు ఏడాది జైలు శిక్షను విధించింన విషయం తెలిసిందే. సత్ప్రవర్తన కారణంగా ఆయనకు శిక్షా కాలం తగ్గింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 న ఆయన జైలు నుండి విడుదల అయ్యారు. గగంలో పలు సందర్భాల్లో తనను కొంతమంది చంపేందుకు ప్రయత్నిస్తున్నారని.. పలుమార్లు తన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారని సిద్దూ అన్నారు. ఈ క్రమంలోనే సిద్దూ ఇంటిపై ఓ అజ్ఞాత వ్యక్తి కలకలం సృష్టించాడు.
ఈ సందర్బంగా నవజ్యోత్ సింగ్ సిద్దూ ‘ఆదివారం ఏడు గంటల సమయంలో బూడిద కలర్ బ్లాంకెట్ చుట్టుకొని ఓ అజ్ఞాత వ్యక్తి కనిపించాడు. నా సెక్యూరిటీ గార్డు వెంటనే అలారం మోగించాడు.. వెంటనే మిగతా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ఆ వ్యక్తి గోడదూకి పారిపోయాడు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీకి, పటియాలా ఎస్ఎస్ పీకి ఫిర్యాదు చేశాను’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి భద్రతా లోపాలు ఎన్నో జరిగాయి.. నన్ను చంపడానికి ఆ అజ్ఞాత వ్యక్తి తన వెంట ఆయుధాలు కూడా తెచ్చి ఉంటాడని అనుమానం వస్తుంద అన్నారు సిద్దూ. పంజాబ్ లో గొంతెత్తే తన లాంటి వ్యక్తులను ఎవరూ ఏమీ చేయలేరు.. నేను చావుకు భయపడను అన్నారు నవజ్యోత్ సింగ్ సిద్దూ. ఈ మద్యనే జైలు నుంచి రిలీజ్ అయ్యారు సిద్దూ.. ఇంతలోనే ఇలా జరగడంతో తన ఇంటి భద్రతపై సిద్దు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.
Today on the terrace of my residence an unknown suspicious character wrapped in grey blanket was noticed around 7:00 PM , the moment my servant went out raised the alarm and called for help , he immediately ran and escaped.
Have spoken to @DGPPunjabPolice and SSP Patiala has…
— Navjot Singh Sidhu (@sherryontopp) April 16, 2023