ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్లో ఓ యువతికి అసభ్యకరంగా చాట్ చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన ఆ యువతి కాళిమాత అవతారమెత్తి ఆ యువకుడికి నడిరోడ్డుపై బుద్ది చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
టెక్నాలజీ యుగం కొత్త పుంతలు తొక్కడంతో ఇప్పుడు అందరి వద్ద స్మార్ట్ ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలా మంది యువత ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలోనే తెలియని వాళ్లను పరిచయం చేసుకుని ప్రేమా గీమా అంటూ వేధింపులకు గురి చేస్తుంటారు. ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్లో ఓ యువతికి అసభ్యకరంగా చాట్ చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన ఆ యువతి ఆ యువకుడిని వెతికి పట్టుకుని నడిరోడ్డుపై బుద్ది చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
ఏపీలోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన కళ్యాణ్ అనే అనే యువకుడు పట్టణంలోని ఓ టీ సెంటర్ లో పని చేస్తున్నాడు. అయితే ఈ యువకుడు గత కొంత కాలం నుంచి ఇన్స్టాగ్రామ్లో ఓ మహిళతో చాటింగ్ చేస్తున్నాడు. తరుచు ఆమెకు అసభ్యకరమైన మెసేజ్ లు చేస్తూ వేధింపులకు గురి చేసేవాడట. ఇక అతడి మెసేజ్ లను చూసి సహించలేకపోయిన ఆ మహిళ కాళిమాత అవతారమెత్తింది. ఆ యువకుడి అడ్రస్ ను వెతికి పట్టుకుని నేరుగా అతడిని నడి రోడ్డుపై చొక్కా పట్టుకుని నిలదీసింది.
అంతేకాకుండా చెప్పుతో కొట్టి సరైన బుద్ది చెప్పింది. గత కొన్ని రోజుల నుంచి ఈ దుర్మార్గుడు నాకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తున్నాడని ఆ మహిళ వాపోయింది. ఇదంతా గమనించిన కొందరు యువకులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇక అదే వీడియోలు సోషల్ మీడియోలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ అయింది. ఇన్స్టాగ్రామ్లో అసభ్యకరంగా మెసేజ్ లు చేసిన యువకుడికి నడి రోడ్డుపై బుద్ది చెప్పిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.