ఈ సృష్టిలో అపురూపమైనది స్త్రీ. ఆమెకు మాతృత్వం అందించే అనుభూతి మరపురానిది. అమ్మను కాబోతున్నానని తెలిసిన మరుక్షణం అనిర్వచనీయమైన ఆనందానికి చిరునామాగా నిలుస్తుంది. ప్రసవ వేదనను సైతం భరిస్తూ తన ప్రతిరూపానికి జన్మనిస్తున్న సంతోషం అమ్మతనపు సౌభాగ్యానికి అద్దం పడుతుంది. జీవితంలోని మరే ఘట్టం కూడా మాతృత్వం తాలూకు మధురిమను పంచదనే సత్యం నిర్వివాదాంశం.
అందుకే పెళ్లైన ప్రతి మహిళ బిడ్డకి జన్మనివ్వడం కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది. తన గర్భంలో మరో ప్రాణికి ఊపిరి పోయడం అంటే ఒరకంగా సృష్టించడమే అవుతుంది. అలాంటి అపూర్వమైన మధురానుభూతిని ఆస్వాదించాలని ప్రతి మహిళ ఉవ్విళ్లూరుతుంది. కానీ మారుతున్న కాలం, అలవాట్లు, పని ఒత్తిడి వల్ల చాలా మంది మహిళలు మాతృత్వం అనే మధురనుభూతికి దూరం అవుతున్నారు. పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా పిల్లలు లేక వారిలో వారు కుమిలిపోతున్నారు. పిల్లల కోసం పరితపిస్తూ, బాబాల చుట్టూ, ఆలయాల చుట్టూ, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అలా పిల్లల కోసం తపించేవారికి ఆశా దీపంగా నిలుస్తుంది ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్. అధునాతన టెక్నాలజీతో సంతానలేమి సమస్యలతో భాధపడ్తున్న వారికి మేమున్నామంటూ భరోసానిస్తోంది.
నేటి బిజీ లైఫ్‌లో ‘‘సంతాన లేమి ’’ అనేది అతి పెద్ద సమస్యగా మారింది. నానాటికీ ఈ సమస్య ఎక్కువ అవుతోంది. సంతానలేమి వల్ల ఆర్థికంగా మరియు మానసికంగా దంపతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించాలనుకునేవారికి ఆశాదీపంగా మారుతోంది.. ఫర్టీ9 ఫర్టీలిటీ సెంటర్.
సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న జంటలలో.. పురుషులలో హార్మోన్ల పరిమాణం ఎంత ఉందో తెలుసుకునేందుకు కొన్ని టెస్టులు నిర్వహించి.. ఫలితాలను బట్టి సమస్య తెలుసుకుని, తగు చికిత్స అందిస్తే పురుషులలో సంతానలేమి సమస్య పరిష్కార మవుతుంది. అదే విధంగా స్త్రీలలో సంతాన సాఫల్యత వృద్ధికి ‘ఈస్ట్రోజెన్’ అనే హార్మోన్ అవసరం.ఈ హార్మోన్ లోపంతో సంతానలేమితో బాధపడే స్త్రీలలో ఈ హార్మోన్ల పరిమాణం తెలుసుకునేందుకు టెస్టులు నిర్వహించి.. ఫలితాలను బట్టి సమస్య తెలుసుకుని, తగు చికిత్స అందిస్తే స్త్రీలలో సంతానలేమి సమస్య పరిష్కార మవుతుంది.
సంతాన సాఫల్యతకు అత్యుత్తమ చికిత్స విధానాలు:
ఐవీఎఫ్: సంతాన సాఫల్యతను పెంపొందించే విధానాలలో ముఖ్యమైనది ఐవీఎఫ్. ఈ విధానంలో పురుషుని వీర్య కణాన్ని స్త్రీ అండంతో.. శరీరం వెలుపల ల్యాబ్ లో కృత్రిమంగా ఫలదీకరణం చెందిస్తారు. ఫలితంగా ఏర్పడిన పిండాన్ని.. స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఫలితంగా బిడ్డకు జన్మనిచ్చేలా తల్లికి చికిత్సను అందిస్తారు.
ఐయూఐ: ఇంట్రా యూటెరిన్ ఇన్సెమినేషన్…ఇది ఒక కృత్రిమమైన ఇన్సెమినేషన్ విధానం.
ఐసిఎస్‌ఐ: పురుషుల్లో వీర్య కణాల సంఖ్య, వేగం తక్కువగా ఉన్న కారణంగా సంతానలేమితో బాధపడుతున్న వారికి ఇది ఉత్తమమైన చికిత్స.
ఐఎంఎస్‌ఐ: ఈ విధానంలో హై పవర్ మైక్రోస్కోపుని ఉపయోగించి.. నాణ్యమైన వీర్యకణాలు ఎంపిక చేసి.. అండంతో ఫలదీకరణం చెందిస్తారు. ఫలితంగా ఏర్పడిన పిండాన్ని.. స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.
పైన చెప్పబడిన అన్ని చికిత్సా విధానాలలో ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ వారు అధునాతన టెక్నాలజీని వాడుతూ మంచి సక్సెస్ రేట్ సాధిస్తున్నారు. కనుక మీలో ఎవరైనా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే బిడియాన్ని పక్కన పెట్టి.. ఫర్టీ9ని సందర్శించి.. మీ సంతానలేమి సమస్యకి పరిష్కారాన్ని పొందండి. చక్కని పిల్లల్ని కని.. ఆనందంగా జీవించండి. మరిన్ని వివరాల కోసం 9390501598 ఈ నెంబర్ ను సంప్రదించండి.