పాఠశాలకు వెళ్లే సమయంలో తెలిసీ తెలియక కొంతమంది విద్యార్థులు చెడు అలవాట్లకు దగ్గరవుతుంటారు. కొన్నిసార్లు బీడీలు, సిగిరెట్లు తాగడం లాంటివి చేస్తుంటారు. ఈ విషయం ఉపాధ్యాయులకు తెలిస్తే అలా చేయద్దు అంటూ ఆ విద్యార్థిని మందలిస్తారు. అలా చేసేది భవిష్యత్ లో మీరు చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదు అని. అలా ఓ విద్యార్థి బీడీలు తాగుతున్నాడని తెలిసి విద్యార్థిని మందలించామన్నారు. అయితే ఆ విద్యార్థి చేసిన పనికి అంతా షాకయ్యారు. టీచర్లు మందలించారని అతను ఆత్మహత్య […]
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ఓ కుటుంబం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. డిగ్రీ కాలేజ్ లో ప్రేవేట్ లెక్చరర్ గా పనిచేసే వేముల శ్రీకాంత్ కుటుంబం మొత్తం నెల రోజుల వ్యవధిలో చనిపోయారు. తర్వాత శ్రీకాంత్ కూడా విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట కుమారుడు, ఆ తర్వాత కుమార్తె, తర్వాత భార్య చనిపోయింది. గ్రామంలో ఎవరికీ ఈ మిస్టరీ అంతు చిక్కలేదు. వాంతులు, విరేచనాలతో చనిపోతుంటే ఏదో వింత వ్యాధి అనుకున్నారు. అయితే […]
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎంత పకడ్బంధీగా వ్యవహరిస్తున్నా కూడా ఇంకా హైదరాబాద్ నగరంలో ఏదో మూల వ్యభిచారం నడుస్తూనే ఉంది. పోలీసులు ఇప్పటివరకు మసాజ్ సెంటర్లు, స్పాలలో వ్యభిచారం గుట్టు రట్టు చేశారు. మొన్నీ మధ్య ఇళ్లలోనూ వ్యభిచారం నడుస్తున్నట్లు పోలీసులు కనుగొని వాటిని కూడా కట్టడి చేశారు. ఇప్పుడు ఓ లాడ్జి యజమానే గుట్టు చప్పుడు కాకుండా తన లాడ్జిలో వ్యభిచారం నడిపిస్తుండగా.. పోలీసులు రైడ్ చేసి వారిని అరెస్ట్ చేశారు. వేరే ప్రాంతాల […]
సికింద్రాబాద్ లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఓ భవంతిలో మంటలు వ్యాపించి ఎనిమిది మంది ప్రణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 10 మందికి గాయాలుఅయ్యాయి. లాడ్జిలో బస చేస్తున్న వీరు అగ్నిప్రమాదం కారణంగా ఊపిరాడక మరణించారు. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎలక్ట్రిక్ షోరూమ్ లో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగానే వీరు మరణించారు. వివరాల్లోకి వెళ్తే.. మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం […]
సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేట వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భయాందోళనతో ఎటు వాళ్లు పరుగులు తీశారు. ఓ అపార్టుమెంట్‌లోని ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్ధంతో కాంక్రీట్ పెళ్లలు చెల్లాచెదురుగా పడ్డాయి. చుట్టూ దుమ్ము, పొగ కమ్మేశాయి. కాసేపు అక్కడ ఏం జరుగుతోందో కూడా ఎవరికీ అర్థం కాలేదు. ఎటువాళ్లు అటు పరుగులు తీశారు. ఆ పేలుడులో భార్యాభర్తలకు గాయాలు కూడా అయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సికింద్రాబాద్‌లోని రాంగోపాల్ పేట పోలీస్ […]
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్ పథకంపై’ దేశవ్యాప్తంగా భద్రతా దళాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారినుంచి వచ్చిన వ్యతిరేకత హింసాత్మక కాండలకు దారితీసింది. అగ్నిపథ్ పథకం ప్రకటించినప్పటి నుంచి దేశం అగ్ని గుండంలా మారిపోయింది. నిరసనలు తెలుపుతున్న ఆర్మీ ఉద్యోగార్థులంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మొదలు పెట్టారు. ఆ అల్లర్లు, ఆందోళనలు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను తాకిన విషయం తెలిసిందే. వందల సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టడం, స్టాళ్లను […]
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకంతో చెలరేగిన అల్లర్లు, ఆందోళనలు పెచ్చుమీరుతున్నాయి. సిక్రిందాబాద్ ను తాకిన అగ్నిపథ్ ఆందోళనలు మరింత తీవ్రతరం అయ్యాయి. ఈ ఆందోళనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు యువకుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. వందల మంది ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి దిగారు. మొదట రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ధ్వంసం […]
సాంకేతికంగా మనిషి ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నా కూడా ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతూనే ఉన్నారు. క్షుద్రపూజలు, బాణామతి వంటివి ఉన్నాయని విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి వారి భయాన్ని అవకాశంగా చేసుకుని వాటి పేరుతో చాలా మందిని మోసం చేస్తున్నవారు లేకపోలేదు. జగిత్యాల జిల్లా అలాంటి ధోరణులు ఎక్కువవతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలకు దిగింది. అలాంటి స్థావరాలపై దాడులు చేసింది. […]
తాళం వేసిన ఇళ్లే అతడి టార్గెట్. అతడు ఒక్కసారి టార్గెట్ చేశాడంటే ఆ ఇళ్లు ఖాళీనే. ఇలా నిత్యం దొంగతనాలకు పాల్పడుతూ.. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతుండే వాడు. ఏడాది కాదు రెండేళ్లు కాదు.. ఏకంగా 16 ఏళ్లుగా దొరక్కుండా పోలీసులకు చుక్కలు చూపించాడు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లోనూ చోరీలకు పాల్పడుతున్న ఈ కేటుగాడిని ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేటుగాడిని పట్టుకునేందుకు పోలీసులు 70 వేలకు పైగా ఫోన్ నంబర్స్ […]
కామారెడ్డి- ఓ యువకుడు, మరో వివాహిత చనువుగా ఉండటం చూడటమే ఆ బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం, ఏ మాత్రం సంబంధంలేని ఓ బాలుడిని బలి తీసుకుంది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. సంచలనం రేపిన పదేళ్ల బాలుడి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాహితతో చనువుగా ఉండడం చూశాడని, ఎవరికైనా చెబితే […]