వీకెండ్ వచ్చినా, వేసవి సెలవులు వచ్చినా చల్లటి లేదా అందమైన ప్రాంతాల్లో సేద తీరాలని, చక్కర్లు కొట్టాలని అనిపిస్తుందీ మనస్సు. కానీ వారికుండే సమస్యలతో పాటు అనివార్య కారణాలతో వెనకడుగు వేస్తుంటారు. . జీవితంలో ఒకసారైనా లేహ్-లద్దాఖ్ పర్యటించాలని అతడు..బైక్ లేకపోవడంతో కోరికను చంపుకోకుండా..తన కాళ్లను నమ్ముకున్నాడు.
దేశ భద్రత కోసం అహర్నిశలు పహారా కాస్తుంటారు సైనికులు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయరు. భార్యా, బిడ్డలను వదిలేసి, ఎండ, వాన, చలి లెక్కచేయకుండా దేశ పౌరుల కోసం సరిహద్దుల్లో కష్టపడుతున్నారు. అటువంటి సైనికుడు.. తాను చనిపోయినా మరొకరి ప్రాణం పోశారు.
ఎవరికో నివాసం లేదని వారికి రూ. 2 కోట్ల విలువ చేసే ఇంటిని రాసిచ్చేశారు. అద్దె ఇళ్లలో శవాన్ని ఉంచనివ్వడం లేదని మృతదేహాల కోసం ప్రత్యేకంగా రూ. 20 లక్షలు ఖర్చు పెట్టి ఒక భవంతిని నిర్మించారు. మధ్యతరగతి వారికి, పేదవారికి తక్కువ ధరకు జెనరిక్ మందులు ఇచ్చే ట్రస్టుకి రూ. 2 లక్షలు, విద్యార్థుల పోటీ పరీక్షల కోసం గ్రంథాలయంలో పుస్తకాలు, గోశాల నిర్మాణానికి విరాళం.. ఇలా ఒకటా రెండా ఎన్నో లక్షలను, ఎన్నో సేవలను […]
పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు ఆదిలక్ష్మి. చిన్నప్పటి నుంచి ఆమెకు చదువంటే ఎంతో ఇష్టం. కానీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో ఆమెకు 13 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. ఇక మా బాధత్య అయిపోయిందని ఆదిలక్ష్మి తల్లిదండ్రులు చేతులు దులుపుకున్నారు. కట్ చేస్తే.. ఆ యువతి భర్తకు విడాకులు ఇచ్చి తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి చేరుకుంది. ఆ యువతి భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చింది? తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎలా ఎదిగిందని పూర్తి వివరాలు […]
ప్రతి ఆడపిల్లకు బాగా చదువుకోవాలని.. మంచి ఉద్యోగం సంపాదించి.. తన కాళ్ల మీద తాను నిలబడాలని కోరుకుంటుంది. స్వేచ్ఛగా బతకాలనుకుంటుంది. కానీ నేటికి కూడా చాలా మంది ఆడపిల్లల విషయంలో నేటికి కూడా ఇవన్ని కలలుగానే మిగిలిపోతున్నాయి. ఆడపిల్లను బరువుగానే భావించే తల్లిదండ్రులు ఇప్పటికి ఉన్నారు. ఇక కన్నవాళ్లే తన బిడ్డ ఆశలు పట్టించుకోనప్పుడు.. మెట్టినింటి వారిమీద నమ్మకం పెట్టుకోవడం ఎండమావిలో నీటి కోసం వెదకడం లాంటిదే. చాలామంది మగాళ్లకు.. భార్య అంటే తనతో పాటు.. అతడి […]
రాఖీ పండుగ ప్రతి ఒక్కరికి ఎంతో స్పెషల్.. ఈ తమ్ముడికి మాత్రం ఈ ఏడాది ఇంకా ప్రత్యేకం. ఆస్తి కోసం కొట్టుకునే అన్నాచెల్లెళ్లు, పగలు ప్రతీకారాలతో ఊగిపోతున్న అక్కాతమ్ముళ్లు ఉన్న ఈ రోజుల్లో వీళ్లు మాత్రం ఎంతోమందికి ఆదర్శం అనే చెప్పాలి. రెండు కిడ్నీలు కోల్పోయిన తమ్ముడికి ఆ అక్క కిడ్నీ ఇచ్చి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఈ రాఖీ సందర్భంగా కచ్చితంగా ఈ అక్కాతమ్ముళ్ల గురించి తెలుసుకోవాల్సిందే. అతని పేరు అమన్ బాత్రా.. 29 […]
‘హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్’.. జీవితంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే. వారు కేవలం మాటలు చెప్పడమే కాదు.. దీన్ని ఆచరణలో పాటించారు కనుకే జీవితంలో విజయం సాధించారు. మరి జీవితంలో విజయం సాధించాలంటే.. గొప్ప గొప్ప చదువులు, ఆర్థిక సహకారం, ఆలోచన ఉంటే విజయం సులభంగా వస్తుందా అంటే కాదు. ఆ లక్ష్యం మదిలో మెదులుతూ ఉండాలి. అందుకు పట్టుదల తోడై ఉండాలి. జీవితంలో విజయం సాధించిన చాలామంది జీవితంలో ఎన్నో […]
అప్పుడే పదో తరగతి పాసైన ఓ పల్లెటూరి కుర్రాడు ఏదో సాధించాలనే తపనతో హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా.. గుండెనిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకొన్నాడు. నెత్తిన గంప పెట్టుకొని చిత్తు కాగితాల వ్యాపారం మొదలుపెట్టాడు. నేడు కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తూ, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతడి జీవిత ప్రయాణం ఇలా సాగింది. ఆయన పేరు మంగినిపల్లి యాదగిరి.. చదువుకున్నది పదో తరగతి. నిరుపేద కుటుంబంలో జన్మించిన యాదగిరి.. డబ్బుల్లేక కుటుంబం పడుతున్న […]
శరీరంలో ఏ లోపం లేకపోయినా.. కావాల్సినవి అన్ని సమకూర్చి పెట్టే తల్లిదండ్రులున్నా.. మనలో చాలా మంది జీవితంలో ఏ లక్ష్యం లేకుండా గడిపేస్తుంటారు. మరి కొందరు లక్ష్యాలు నిర్దేశించుకుంటారు.. కానీ వాటిని చేరుకునే ప్రయత్నం చేయరు. అలాంటి వారందరికి స్ఫూర్తిగా నిలిచే కథనాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. చిన్నప్పుడే ఆ యువతిని తల్లిదండ్రులు వదిలేశారు. భిక్షమెత్తుకునే దంపతులు ఆ చిన్నారని చేరదీశారు. వారితో పాటు భిక్షాటనకు తీసుకెళ్లారు. కానీ ఆ చిన్నారికి చదువుకోవాలనే కోరిక బలంగా […]
ఐఏఎస్, ఐపీఎస్ అధికారి కావడం అంటే అంత సామాన్య విషయం కాదు. దీని కోసం అహోరాత్రులు కష్టపడాలి, మరేన్నో త్యాగం చేయాలి. పేదరికంలో ఉన్న సామాన్య కుటుంబానికి చెందిన ఓ తండ్రి తన కొడుకు ఐపీఎస్ అధికారి కావాలని ఎన్నో కలలు కన్నాడు. తండ్రి కలను సాకారం చేయాడనికి ఆ కొడుకు తన సంతోషాలు వదులుకోని కష్ట పడ్డాడు. చివరికి తండ్రి కొడుకుల కష్టం ఫలించింది. అనుకున్నది సాధించాడు ఆ పుత్రుడు. అయితే ఇలా ఐపీఎస్ అయిన […]