‘హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్’.. జీవితంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే. వారు కేవలం మాటలు చెప్పడమే కాదు.. దీన్ని ఆచరణలో పాటించారు కనుకే జీవితంలో విజయం సాధించారు. మరి జీవితంలో విజయం సాధించాలంటే.. గొప్ప గొప్ప చదువులు, ఆర్థిక సహకారం, ఆలోచన ఉంటే విజయం సులభంగా వస్తుందా అంటే కాదు. ఆ లక్ష్యం మదిలో మెదులుతూ ఉండాలి. అందుకు పట్టుదల తోడై ఉండాలి.
జీవితంలో విజయం సాధించిన చాలామంది జీవితంలో ఎన్నో కష్టాల ఒడిదుడుకులను దాటుకుని ఈ రోజు గొప్ప స్థాయికి చేరుకున్న వారే. మనిషికి పట్టుదల ఉంటే.. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా.. లక్ష్యాన్ని వదులుకోరు. అదే నిరాశలో కూరుకుపోతే.. చిన్న చిన్న కష్టాలకు కూడా కుంగిపోతారు. అలా కష్టాలు దాటుకుని.. డెలివరీ బాయ్‌గా జీవితం ప్రారంభించి.. నేడు లక్షల్లో ఆదాయం సాధిస్తున్న వ్యాపారవేత్తగా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు మనం చెప్తున్న సురేష్. అతడి జీవిత ప్రయాణం ఎందరికో ఆదర్శం. కష్టాలు చుట్టుముట్టినా.. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా సరే… ఒకరి కింద పని చేయకూడదనే ఉద్దేశంతో.. డెలివీర బాయ్ నుంచి.. వ్యాపారవేత్తగా ఎదిగాడు. సుమన్‌టీవీకిచ్చిన ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో తన అనుభవాలను వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.
ఇది కూడా చదవండి: Inspirational Story: ఎందరికో ఆదర్శం ఈ చంద్రకాంత్.. అంగవైకల్యాన్ని జయించి.. లక్షల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు!