వీకెండ్ వచ్చినా, వేసవి సెలవులు వచ్చినా చల్లటి లేదా అందమైన ప్రాంతాల్లో సేద తీరాలని, చక్కర్లు కొట్టాలని అనిపిస్తుందీ మనస్సు. కానీ వారికుండే సమస్యలతో పాటు అనివార్య కారణాలతో వెనకడుగు వేస్తుంటారు. . జీవితంలో ఒకసారైనా లేహ్-లద్దాఖ్ పర్యటించాలని అతడు..బైక్ లేకపోవడంతో కోరికను చంపుకోకుండా..తన కాళ్లను నమ్ముకున్నాడు.
ప్రయాణాలంటే చాలా మంది ఇష్టం. ఒంటరిగా బైక్ రైడింగ్ చేయాలని, కుటుంబంతో కలిసి పర్యాటక ప్రదేశాలను చుట్టి రావాలని అనుకుంటారు. దానికి సమయం, డబ్బు లేక లేదంటే బాధ్యతల బంధీఖానాలో పడిపోయి.. ఆ కోరికలను అణచివేసుకుంటారు కొందరు. వీకెండ్ వచ్చినా, వేసవి సెలవులు వచ్చినా చల్లటి లేదా అందమైన ప్రాంతాల్లో సేద తీరాలని, చక్కర్లు కొట్టాలని అనిపిస్తుందీ మనస్సు. కానీ వారికుండే సమస్యలతో పాటు అనివార్య కారణాలతో వెనకడుగు వేస్తుంటారు. జీవితంలో ఒకసారైనా లేహ్-లద్దాఖ్ పర్యటించాలని అతడు కూడా కలలు కన్నాడు. అయితే తన వద్ద బైక్ లేకపోవడంతో కోరికను చంపుకోకుండా..తన కాళ్లను నమ్ముకున్నాడు.
పశ్చిమ బెంగాల్‍లోని అసన్ సోల్ నగరానికి చెందిన దెబు ముఖర్జీకి లద్దాఖ్ ట్రిప్ వేయాలని కోరిక ఉండేది. అయితే అతడి స్నేహితులంతా ద్విచక్ర వాహనాలపై పర్యటించి వచ్చారు. ఆ సమయంలో వారితో వెళ్లాలని భావించానా.. బైక్ లేకపోవడంతో ఆగిపోయాడు. ఎలక్ట్రిక్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న దెబు ముఖర్జీ వద్ద బైక్ కొనేటంత డబ్బుల్లేవు. తన కోరిక తీర్చుకోవాలని నిర్ణయించుకున్న దెబు.. లద్ధాఖ్‌ను చూసి రావాలని బలంగా కోరకుకున్నాడు. బైక్ లేకపోవడంతో కాలి నడక ద్వారానే చుట్టి రావాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన స్వస్థలం అసన్ సోల్ నుండి నడక ప్రారంభించాడు.
అలా లద్దాఖ్ పర్యటనను 72 రోజుల్లో పూర్తి చేశాడు. 2,401 కిలోమీటర్లు నడిచాక లద్దాఖ్ చేరుకొని మంచుకొండల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ఇటీవలే ఇంటికి చేరుకున్న దెబు తన అనుభవాలు పంచుకున్నాడు. ‘చాలా రోజులు ఆకలితోనే నడిచా. స్నేహితులు డబ్బులు పంపితే ఆహారం కొనుక్కొని తిన్నా. రోడ్ల పక్కన తోపుడుబండ్ల మీద రాత్రిళ్లు నిద్రించా. అడవి జంతువులను చూసినపుడు భయమేసేది. చివరకు అనుకున్నది సాధించా‘నని ఆనందాన్ని వ్యక్తం చేశారు.