ధోని నాకు చెప్పిన మాట.. నేను ఎప్పటికీ మర్చిపోలేను: కోహ్లీ

Kohli reminds Dhoni Words

భారత్‌- సౌత్‌ ఆఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మంగళవారం చివరి టెస్టు ప్రారంభ కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్‌, రెండో టెస్టులో దక్షిణాఫ్రికా గెలిచి సమవుజ్జీలుగా నిలిచాయి. చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం విలేకరులతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పలు విషయాలపై స్పందించాడు.

తాను గాయం నుంచి కోలుకున్నట్లు.. మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉన్నట్లు తెలిపాడు. అలాగే పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని అతను మూడో టెస్టుకు అందుబాటులో ఉండడని కోహ్లీ తెలిపాడు. ఇక తన ఫామ్‌పై స్పందించిన విరాట్‌ కోహ్లీ.. తాను దేని గురించి ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. అలాగే రెండో టెస్టులో రిషభ్‌ పంత్‌ ఆడిన చెత్త షాట్‌పై స్పందిస్తూ.. పొరపాట్లు అందరు చేస్తారు. అలాగే పంత్‌ కూడా చేశాడు. అంతే అన్నాడు.

Kohli reminds Dhoni Words

ఒక పొరపాటు మనం చేసినప్పుడు మళ్లీ దాన్ని పునరావృతం చేయకుడదని, కనీసం 7-8 నెలలు దాని జోలికి వెళ్లకుడదని ధోని తనతో చెప్పినట్లు.. ఆ మాటలను తాను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని విరాట్‌ కోహ్లీ అన్నాడు. పంత్‌ కూడా మళ్లీ ఆ పొరపాటు చేయవద్దని.. కోహ్లీ ఇన్‌డైరెక్ట్‌గా స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. మరి విరాట్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీ మొండితనం ముందు అవన్నీ ఒక లెక్క కాదు