ఎప్పుడూ మమ్మల్నే కాదు.. స్టంప్స్‌ మైక్‌లో ఆగ్రహం వ్యక్తం చేసిన విరాట్‌ కోహ్లీ

కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ చాలా అగ్రెసివ్‌ ఉంటాడు. జట్టు గెలుపును అనుక్షణం తపిస్తుంటాడు. జట్టులోని ఆటగాళ్లలో విశ్వాసం నింపుతూ.. మ్యాచ్‌లో ప్రతి సెకన్‌ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. అలాగే అంపైర్‌ తప్పుడు నిర్ణయాలపై బహాటంగానే అసంతృత్తి వ్యక్త చేస్తుంటాడు. సౌత్‌ ఆఫ్రికాతో కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఎల్గర్‌ అవుట్‌ కోసం చేసిన అప్పిల్‌ తర్వాత తీవ్ర అసహనానికి గురైన విరాట్‌… ఏకంగా స్టంప్స్‌ వద్దకు వెళ్లి మ్యాచ్‌ను లైవ్‌ ఇస్తున్న బ్రాడ్‌ కాస్టింగ్‌ వాళ్లకు చురకలు అంటించాడు.

దక్షిణాఫ్రికా అధికార బ్రాడ్‌కాస్టర్ సూపర్‌ స్పోర్ట్‌ను ఉద్దేశించి ‘బంతికి మెరుగు పెడుతున్నపుడు.. కేవలం ప్రత్యర్థి పైనే కాదు మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి. ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టుకోవాలని చూస్తారు” అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం విరాట్‌ స్టంప్స్‌ మైక్‌ వద్ద మాట్లాడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా కోహ్లీ చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి కోహ్లీ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.