ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దుమ్మురేపుతున్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయంతో టేబుల్ టాప్ ప్లేస్‌కు చేరుకుంది సీఎస్కే. విజయలక్ష్యాన్ని కేవలం 18.1 ఓవర్లలోనే ఛేదించి అందరినీ ఆకట్టుకున్నారు. పాయింట్ల పట్టికలో అత్యధిక నెట్ రన్‌రేట్(+1.18)తో చెన్నై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో టీమిండియా మాజీ ఓబెనర్ గౌతమ్ గంభీర్.. కెప్టెన్ కూల్‌కు ఓ సూచన చేశాడు. ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాక ధోనీ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోవాలని తెలిపాడు. ప్రతిసారి మూడో డౌన్, నాలుగో డౌన్ స్థానాల్లో వచ్చే వారు రాణించలేరని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
కార్యక్రమంలో మాట్లాడుతూ గంభీర్ ఆసక్తికర కామెంట్లు, సూచనలు చేశాడు. చైన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరాక ఫస్ట్ బ్యాటింగ్ అయినా.. ఛేజింగ్ అయినా ధోనా తప్పకుండా తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకోవాలన్నాడు. నిజానికి నంబర్ 3, నంబర్ 4 ప్రతిసారి పరుగులు రాణించలేరని తెలిపాడు. అలాంటి సమయంలో అనుభవజ్ఞుడైన ఆటగాడు టీమ్‌కు అవసరమని సూచించాడు. ‘ప్లేఆఫ్స్‌కు చేరినంత మాత్రాన కెప్టెన్‌పై భారం తగ్గిపోదు. ముందుకు సాగాలంటే మరింత శ్రమించాల్సి ఉంటుంది. మొదటే వికెట్లు కోల్పోతే కష్టం.. అందుకే కెప్టెన్ తన స్థానాన్ని మార్చుకోవాలి’ అంటూ గౌతమ్ గంభీర్ పలు సూచనలు చేశాడు. అలా చేయడం వల్ల జట్టుకు ఉపయోగంగా ఉంటుంది. కెప్టెన్‌గా తనకు ఆ అవకాశం కూడా ఉంటుంది.