అరంగేట్రం వన్డేలోనే నాలుగు వికెట్లు తీసిన స్పిన్నర్‌!

maheesh theekshana

కొలంబో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో శ్రీలంక 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ 2-1తో కైవశం చేసుకుంది శ్రీలంక. ఈ మ్యాచ్‌లో మరో అద్భుతం కూడా జరిగింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే శ్రీలంక స్పిన్నర్‌ మహీష్‌ తీక్షణ నాలుగు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. అంతేకాదు, మ్యాచ్‌ తర్వాత శ్రీలంక కెప్టెన్‌ గాసున్‌ శనక మహీష్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

maheesh theekshanaమహీష్‌ తీక్షణకు లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఆడిన అనుభవం ఉంది. కుడిచేతి వాటం స్పిన్నర్‌ అయిన తీక్షణ చాలా వైవిధ్యంగా బౌలింగ్‌ చేస్తాడు. అతడి బౌలింగ్‌ని అర్థం చేసుకోవడం అంతసులభం కాదని శ్రీలకం కెప్టెన్‌ చెప్పుకొచ్చాడు. మహీష్‌ తీక్షణ వికెట్లు తీసిన వీడియో ఐసీసీ అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు. ‘అరంగేట్ర వన్డేలోనే నాలుగు వికెట్లు.. మహీష్‌ తీక్షణ నుంచి అద్భుత ప్రదర్శన’ అంటూ ఐసీసీ వీడియోని షేర్‌ చేసింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.