అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాం.. ముందు టీమిండియా తర్వాత కివీస్‌

IPL 2021

పాకిస్థాన్‌ పర్యటనకు వచ్చి భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ ప్రారంభానికి కొద్దిసేపు ముందు పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు పాకిస్తాన్‌ను షాక్‌కు గురిచేసిన సంగతి తెలిసిందే. అదే వరుసలో ఇప్పుడు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు కూడా తమ పాకిస్థాన్‌ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి ఇప్పటికే అవమాన భారంతో మండిపోతున్న పాకిస్థాన్‌ క్రికెటర్ల మీద కారం చల్లినట్లు అయింది. న్యూజిలాండ్‌ పర్యటన రద్దైనప్పుడే తీవ్రంగా స్పందించిన పాక్‌ మాజీ పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ సోయబ్‌ అక్తర్‌ ఈ సారి మరింత ఘాటుగా స్పందించారు. ఇంగ్లండ్‌ పర్యటన రద్దు అయ్యేందుకు కూడా కివీస్‌ జట్టే కారణమని దానికి ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వచ్చే నెలలో జరిగే టీ20 వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అక్టోబర్‌ 24న తొలి మ్యాచ్‌ ఇండియాతో మన మ్యాచ్‌లో వరల్డ్‌ కప్‌లో మొదలవుతాయి. అనంతరం 26న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచే మనకు ముఖ్యం అని పేర్కొన్నాడు.