ఐసీసీ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ విషయంలో అక్తర్‌ అసహనం..

shoaib akhtar

‘ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌’ ఛాంపియన్స్‌ గా ఆస్ట్రేలియా అవతరించిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరిత ఫైనల్‌ లో న్యూజిలాండ్‌ ను మట్టి కరిపించింది. సీజన్‌ మొత్తం ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన డేవిడ్‌ వార్నర్‌ కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ లభించింది. ఇప్పుడు ఆ విషయంలో పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అసలు ఆ నిర్ణయమే కరెక్ట్‌ కాదంటూ వ్యాఖ్యానించాడు. ‘నేను ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌.. బాబర్‌ అజమ్‌ కు దక్కుతుందని ఆశించాను. అత్యధిక పరుగులు చేసిన బాబర్‌ ను కాదని వార్నర్‌ కు ఈ టైటిల్‌ దక్కడం సరైన నిర్ణయం కాదని భావిస్తున్నా’ అంటూ రావల్‌ పిండి ఎక్స్‌ ప్రెస్‌ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌ లో బాబర్ అజమ్‌ 303 పరుగులు చేసి టాప్‌ ప్లేస్‌ లో ఉన్నాడు.

]

వార్నర్‌ ఎందుకంటే..

డేవిడ్‌ వార్నర్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ లో దారుణమైన ఫామ్‌ లో ఉన్న విషయం తెలిసిందే. తన కెరీర్‌లోనే అత్యల్ప రన్‌ రేట్‌ నమోదు చేశాడు. SRH టీమ్‌ లో చోటు కూడా కోల్పోయాడు. అలాంటి గడ్డు పరిస్థితులను అధిగమించి. ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తం 289 పరుగులు సాధించి టాప్‌ 2 బ్యాట్స్‌ మన్‌ గా ఉన్నాడు. అతను 7 మ్యాచ్‌ లలో 3 హాఫ్‌ సెంచరీలతో రాణించాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌ పై 49, ఫైనల్‌ లో న్యూజిలాండ్‌ పై 53 ఎంతో కీలకమైన ఇన్నింగ్స్‌. ఆస్ట్రేలియాకు ఈ సీజన్‌ లో మోస్ట్‌ ప్రామిసింగ్‌ ప్లేయర్‌ గా కనిపించాడు డేవిడ్‌ వార్నర్‌. అందుకే ఐసీసీ కూడా వార్నర్‌ వైపే మొగ్గు చూపిందని భావిస్తున్నారు. అక్తర్‌ చేసిన కామెంట్స్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.