పుజారా.. కోహ్లీలా, కోహ్లీ.. పుజారాలా మారిపోయారేంటి?

Kohli and Pujara Batting

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య కేప్‌ టౌన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు నిర్ణయించాడు. అదిలోనే టీమిండియా ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ అవుట్‌ అవ్వడంతో భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో పుజారా, విరాట్‌ కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే పనిని భుజాన వేసుకున్నారు.

ఆచితూచి ఆడుతూ నిదానంగా పరుగులు జోడించారు. ఈ క్రమంలో పుజారా తన సహజశైలికి భిన్నంగా కాస్తా దూకుడుగా ఆడితే.. విరాట్‌ కోహ్లీ మరీ నిదానంగా బ్యాటింగ్‌ చేశాడు. 80 బంతులు ఆడిన పుజారా 43 పరుగుల చేశాడు. అందులో 7 ఫోర్లు ఉన్నాయి. కోహ్లీ మాత్రం 77 బంతులు ఆడి కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు ఫోర్లు ఉన్నాయి. వీరి ఇన్నింగ్స్‌లు చూస్తున్న నెటిజన్లు.. కోహ్లీ పుజారాలా, పుజారా కోహ్లీలా ఆడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

వాస్తవానికి కోహ్లీ కొంచెం అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ చేస్తాడు.. అలాగే పుజారా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ అన్న విషయం తెలిసిందే. కానీ ఈ టెస్టులో ఇద్దరు తమతమ బ్యాటింగ్‌ శైలిని ఎక్స్‌చేంజ్‌ చేసుకున్నట్లు కనిపిస్తుందని కూడా సోషల్‌ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే.. కోహ్లీ పుజారా చూసి, పుజారా కోహ్లీని చూసి నేర్చుకుంటున్నారు అంటూ కూడా కామెంట్లు వస్తున్నాయి. మరీ ఈ ఇద్దరి బ్యాటింగ్‌ శైలిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.