ఫోర్ కాదు..సిక్స్ కాదు..అయినా ఒక బంతికి 7 పరుగులు

Bangladesh Did 7 runs in one Ball

న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లా ఫీల్డర్ల నిర్వాకానికి ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. క్రీజులో ఉన్న బ్యాట్స్ మెన్ ఫోర్ కొట్టలేదు, కనీసం సిక్సర్ కోసం ట్రై కూడా చేయలేదు. కానీ కివీస్ కు మాత్రం ఒక బంతికి ఏడు పరుగులొచ్చాయి. ఇందులో మరో ముఖ్యమైన విషయమేమిటంటే..ఆ బాల్ కు క్యాచ్ మిస్ కూడా అయింది. అదెలా అనుకుంటున్నారా..?

తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎబాదత్ హుస్సేన్, ఈ మ్యాచులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లంచ్ విరామం తరువాత వేసిన 26వ ఓవర్లో అఖరి బంతిను విల్‌ యంగ్‌ డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు. బంతి ఎడ్జ్‌ తీసుకుంది..ఆ సమయంలో సెకండ్ స్లిప్‌లో ఉన్న లిటన్ దాస్ క్యాచ్‌ను వదిలివేయడంతో బంతి థర్డ్ మ్యాన్ వైపు వెళ్లింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ బంతిని కీపర్ కు విసిరాడు. ఇంతలో న్యూజిలాండ్‌ బ్యాటర్లు మూడు పరుగులు రాబట్టారు. బంతిని అందుకున్న కీపర్ నురుల్ హసన్ బౌలర్ వైపునకు విసరడంతో అది కాస్తా బౌండరీకి వెళ్ళింది. దీంతో ఓవర్‌త్రో రూపంలో మరో 4 పరుగులు రావడంతో.. అంపైర్‌ మెత్తంగా ఏడు పరుగులు ఇచ్చాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Bangladesh Did 7 runs in one Ball