10 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క పరుగు చేయని క్రికెటర్‌! జట్టులో అతనుండాల్సిందే

Ebadath Hussain Worst Batting in Test

క్రికెట్‌లో నిరంతరం ఫామ్‌లో ఉంటూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలి. ఇలా ఉంటేనే క్రికెట్‌ కెరీర్‌కు ఢోకా లేకుండా ఉంటుంది. అలా కాకుండే ఫామ్‌లేమితో ఒకటి రెండో మ్యాచ్‌లలో విఫలం అయితే.. పర్వాలేదు అవకాశాలు రావచ్చు. కానీ ఏకంగా ఒక 10 ఇన్నింగ్స్‌లలో ఒక పరుగు కూడా చేయకుండా ఉంటే.. జట్టులో చోటు ఉంటుందా? కచ్చితంగా ఒక అంతర్జాతీయ క్రికెట్‌ టీమ్‌లో మాత్రం ఉండదు. కానీ బంగ్లాదేశ్‌ నేషనల్‌ టీమ్‌లో మాత్రం ఒక క్రికెటర్‌ 10 ఇన్నింగ్స్‌లలో ఒక్క పరుగు చేయకుండానే జట్టులో కొనసాగుతున్నాడు.

Ebadath Hussain Worst Batting in Test

బంగ్లాదేశ్ ఆటగాడు ఇబాదత్‌ హుస్సేన్ టెస్టు క్రికెట్‌లో గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క పరుగు కూడా చేయలేదు. అసలు ఖాతానే తెరవలేదు. బ్యాట్‌తో మైదానంలోకి రావడం తర్వాత పెవిలియన్ చేరడం అంతే సంగతులు. వాస్తవానికి హుస్సేన్‌ నిఖార్సయిన బౌలర్‌. ప్రస్తుత న్యూజిలాండ్ పర్యటనలో 2 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 9 వికెట్లు తీశాడు. హుస్సేన్‌ బ్యాట్స్‌మెన్‌ కానప్పటికీ టెస్టుల్లో అత్యధిక ఇన్నింగ్స్‌ల్లో ఒక్క పరుగు కూడా చేయని ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు 16 ఇన్నింగ్స్‌ల్లో హుస్సేన్‌ కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు.

ఇదీ చదవండి: ఫోర్ కాదు..సిక్స్ కాదు..అయినా ఒక బంతికి 7 పరుగులు