ఐపీఎల్ 2021 సెకండ్ సీజన్ లో ప్రతీ మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారుతోంది. ఇక సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ హోరాహోరిగా సాగిన ఈ పోరులో చెన్నై ఓటమిని చవి చూసింది. అయితే ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై 20 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఇదే విధంగా డిల్లీ క్యాపిటల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ కి చెన్నై బ్యాట్స్ మెన్స్ చుక్కలు చూస్తూ వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టారు.
ఇక హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అంబటి రాయుడు సహా మిగత ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని తమ ఖాతాలో వేసుకోగలిగారు. అయితే పిచ్ అనుకూలించని కారణంగా రన్స్ చేయటంలో ఇరు జట్లు కాస్త ఇబ్బంది పడ్డయన్నది వాస్తవం. ఇదిలా ఉంటే రాత్రి చెన్నై టీం మ్యాచ్ ఓడిపోవటానికి ధోనీ చేసిన తప్పే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక విషయం ఏంటంటే..? మంచి ఫామ్ లో ఉన్న రవింద్ర జడేజాను బ్యాటింగ్ కు దించకుండా ధోనీ వచ్చాడని, దీంతో వచ్చినా తన ఆట తీరుతో ఆకట్టుకోలేకపోయాడు. 27 బంతులు ఆడి కేవలం 18 పరుగులు రాబట్టి జట్టు ఓటమికి కారణమయ్యాడంటూ ఫ్యాన్స్ ధోనిపై విరుచుకుపడుతున్నారు. ఇక ధోనీ ప్లేస్ లో రవింద్ర జడేజా గనుక వచ్చి ఉంటే ఎక్కువ పరుగులు సాధించి చెన్నై విజయం సాధించి ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయాపడుతున్నారు. ఢిల్లీతో చెన్నై ఓడిపోవటానికి ధోనీనే కారణమయ్యాడన్న ఫ్యాన్స్ అభిప్రాయాన్ని ఏకభివిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిజేయండి.