డేవిడ్‌ వార్నర్‌.. SRH యాజమాన్యం మధ్య అసలు గొడవ ఇదేనా?

david warner srh

ఐపీఎల్‌ 2021’ సీజన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఒక పీడకల అనే చెప్పాలి. టోర్నీలో అందరికంటే ముందే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు చేజార్చుకున్న టీమ్‌ హైదరాబాద్‌. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలో గెలిచి 4 పాయింట్లతో అట్టడుగు స్థానానికి పరిమితమైంది. ఫామ్‌ పరంగా ఎన్నో అభాండాలు మోస్తున్న హైదరాబాద్‌ టీమ్‌కు వార్నర్‌ రూపంలో మరికొన్ని నిందలు కూడా ఎదురయ్యాయి. వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం.. డగౌట్‌లోకూడా చోటు కల్పించకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. సన్‌రైజర్స్‌ యాజమాన్యం అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఇప్పుడు తాజాగా తెరపైకి కొత్త కోణాలు, అనుమానాలు వచ్చాయి. అసలు వార్నర్‌ను తప్పించడానికి కేవలం ఫామ్‌ ఒక్కటే కారణమా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.

సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌

హైదరాబాద్‌ టీమ్‌కు మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. 2013లో టీమ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి వార్నర్‌ బ్యాట్‌కు అసలు అడ్డే లేకుండా పోయంది. 2013 నుంచి 2019 వరకు డేవిడ్‌ వార్నర్‌ ఏటా 500 పరుగులకు పైగా స్కోర్‌ చేశాడు. మూడుసార్లు ఆరంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ డేవిడ్‌ వార్నర్‌. 2014లో కెప్టెన్‌ అయ్యాక రెండేళ్లలోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ట్రోఫీని అందించాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ 195 పరుగులు చేశాడు. కేవలం ఈ ఒక్క సీజన్‌లో ప్రదర్శనను కారణంగా చూపి అతనితో ఇంత దారణంగా ప్రవర్తించడం సరికాదని అభిమానులు వాపోతున్నారు.

david warner srhఅసలు గొడవ ఇదేనా?

డేవిడ్‌ వార్నర్‌ను జట్టు నుంచి తప్పించేందుకు ఫామ్‌ ఒక్కటే కారణం కాదని.. మరేదో కారణం ఉందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యానికి వార్నర్‌కు మధ్య ఏదో జరిగిందని మాట్లాడుకుంటున్నారు. ఐపీఎల్‌ 2021 ఫస్టాఫ్‌లో మ్యాచ్‌ల సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లో యాజమాన్యానికి వార్నర్‌కు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. యాజమాన్యం, సెలక్షన్‌ కమిటీ, కోచింగ్‌ స్టాఫ్‌ తీరుతో వార్నర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. సన్‌రైజర్స్‌ టీమ్‌లో ప్లేయింగ్‌ లెవెన్‌ ఎంపిక, గేమ్‌ వ్యూహాల విషయంలో కెప్టెన్‌ పాత్ర ఏమీ ఉండదని అందరికీ తెలిసిందే. ఈ విషయంలోనే కేన్‌ విలియమ్సన్‌ కూడా మ్యాచ్‌ అనంతరం పలు సంచలన కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అదే అంశంపై యాజమాన్యంతో గొడవకు దిగినట్లు సమాచారం. ఇదే అంశంపై వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ కూడా వ్యాఖ్యలు చేశాడు. కేవలం ప్రదర్శన ఆధారంగా పక్కన పెట్టే అవకాశం లేదని. వారి దగ్గర ఇంకా ఏదో క్రికేటేతర కారణాలు ఉన్నాయని మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు.

2021లో వార్నర్‌ ప్రదర్శన

ఈ సీజన్‌లో వార్నర్‌ 8 మ్యాచ్‌లు ఆడి 195 పరుగులు చేశాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌(పంజాబ్‌) ఈ సీజన్‌లో 10 మ్యాచుల్లో 193 పరుగులు చేశాడు. ధినేష్‌ కార్తిక్‌(కేకేఆర్‌) 13 మ్యాచుల్లో 190, రస్సెల్‌(కేకేఆర్‌) 10 మ్యాచుల్లో 183, సురేష్‌ రైనా(సీఎస్కే) 12 మ్యాచుల్లో 160, కేన్‌ విలియమ్సన్‌ 9 మ్యాచుల్లో 235 పరుగులు సాధించాడు. ఈ ప్రకారంగా చూస్తే అర్థమవుతుంది.. డేవిడ్‌ వార్నర్‌ ఈ సీజన్‌లో మరీ తీసిపారేసే ప్రదర్శన ఏమీ చేయలేదు అని. ఈ లెక్కలు కూడా వార్నర్‌ను తప్పించడానికి మరేదో కారణం ఉంది అనే వాదనకు బలం చేకూరుస్తోంది. డేవిడ్‌ వార్నర్‌ను తప్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సమంత ఎంత నరకం అనుభవించిందో మీకు తెలుసా? మాధవీలత సంచలన కామెంట్స్!