సమంత ఎంత నరకం అనుభవించిందో మీకు తెలుసా? మాధవీలత సంచలన కామెంట్స్!

madhavi latha

ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ సమంత- నాగ చైతన్య విడాకుల విషయమే. మీడియా, సోషల్‌ మీడియా ఎక్కడ చూసినా వారిద్దరి విడాకుల విషయమే. వాళ్లు ఎందుకు విడిపోయారు? వారి బంధం తెగిపోవడానికి ఎవరు కారణం? అలా ఎందుకు చేశారు? ఇలా పలు అంశాలపై కథనాలు రాసే పనిలో బిజీగా ఉన్నారు. వీటన్నింటిలో దాదాపుగా సమంతదే తప్పు అనే కోణంలోనే ఉంటున్నాయి. సమంత మాజీ ప్రియుడు కారణం అంటూ కొందరు, ఆమె వ్యక్తిగత ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ కారణం అంటూ కొందరు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు నటి మాధవీ లత సమంత- నాగ చైతన్య విడాకుల విషయంపై స్పందించింది. ఆమె లైవ్‌లో మాట్లాడుతూ అక్కినేని కుటుంబంపై పలు షాకింగ్‌ ఆరోపణలు చేసింది.

సమంత డబ్బు సంపాదించే యంత్రం!

సమంత మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఆమె చదువుకునే రోజుల్లోనే మోడలింగ్‌ చేస్తూ సినిమా అవకాశం రావడంతో ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. చేతిలో రూపాయి లేని స్థితి నుంచి కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగింది సమంత. అలాంటి సమంతను అక్కినేని కుటుంబం డబ్బు సంపాదించే యంత్రంగా చూస్తున్నారంటూ మాధవీ లత ఆరోపించింది. ‘సమంత వారికి కేవలం డబ్బు సంపాదించే యంత్రమే. కోట్లు సంపాదించే సమంతకు వారు పాకెట్‌ మనీ ఇస్తారు. లక్షలు కూడా కాదు.. కేవలం వెలు మాత్రమే ఆమెకు పాకెట్‌ మనీ ఇస్తారు’ అంటూ మాధవీ లత ఆరోపించింది.

madhavi lathaసమంత తల్లి కావాలనుకుంది!

‘తల్లి కావాలనుకున్న సమంత ఆశలను ఆవిరి చేశారు. ఆమెకు 30 వచ్చేసరికి తల్లికావాలని కోరుకుంది. అలా అయితే ఆమె బిడ్డకు 15 వచ్చేసరికి తనకు 45 వస్తాయి. తన బిడ్డ తనతో ఆడుకోవాలని కోరుకుంటే అప్పుడు ఆమెకు తగిన శక్తి ఉంటుంది కాబట్టి ఆడుకోగలను అని సమంత చెప్పింది. అలాంటి ఆమె ఆశలను వీళ్లు కేవలం డబ్బు కోసం నిజం కానివ్వలేదు’ అని తీవ్రంగా ఆరోపించింది మాధవీ లత.

ఇదీ చదవండి: టీ-20 వరల్డ్‌ కప్‌: భారత్‌- పాక్‌ మ్యాచ్‌.. హాట్‌ కేకుల్లా అమ్మడుపోయిన టికెట్లు

పిచ్చి సంబంధాలు అంట కట్టకండి!

‘సమంత పర్సనల్‌ డిజైనర్‌తో సమంతకు సంబంధాలు అంటకడుతూ కథనాలు వస్తున్నాయి. సమంతను అతను అక్క అని పిలుస్తాడు. ఆమెతో ఎంతో అభిమానంగా ఉంటాడు. అలాంటి తప్పుడు బంధాలు అంటకట్టి సమంత గురించి తప్పుగా మాట్లాడకండి. తప్పుడు భాష ఉపయోగించకండి. సమంత ఎన్జీవోల సాయంతో ఎంతో మందికి సేవలు చేసింది. ఎంతో మంది పిల్లలను ఆదుకుంది. అలాంటి ఆమెకు ఇలాంటి సంబంధాలు అంటకట్టకండి’ అంటూ మాధవీ లత సూచించింది. సమంతది చిన్న కుటుంబం కాబట్టే అందరూ ఇలా మాట్లాడుతున్నారా? సమంతకున్న మంచి మనసులో ఒక్క శాతం మీకున్నా అలూ మాట్లాడరంటూ మాధవీ లత చెప్పుకొచ్చింది.

ఇలాంటి ఎన్నో షాకింగ్‌ ఆరోపణలు, అంశాలతో మాధవీలత పోస్టు ఉంది. కొన్ని కోట్లు వారసత్వ ఆస్తిగా వచ్చిన నాగార్జున కుటుంబానికి సమంతను డబ్బు కోసం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందా? ఆమెకు నిజంగానే స్వేచ్ఛ లేకుండా చేశారా? మరీ పాకెట్‌ మనీ తీసుకుని బతికే దీన స్థితిలో సమంత ఉందా? ఇవన్నీ నిజాలా? లేక మాధవీ లత అలా చెప్పిందా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు మాధవీ లత కామెంట్లపై అటు అక్కినేని కుటుంబం, ఇటు సమంత ఎవరూ స్పందించలేదు. మరి ఎలా స్పందిస్తారు అన్నదే ఆసక్తిగా మారింది.