సాగు చట్టాల రద్దు నిర్ణయంపై స్పందించిన తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి

Niranjan Reddy Trs Telangana Farmbills

మోదీ సర్కార్ సంచనల నిర్ణయం తీసుకుంది. 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు చట్టాలు రద్దుకు ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. అయితే సుధీర్ఘ కాలంలో ఈ చట్టాలపై రైతులు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ సాగు చట్టాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకారం తెలిపారు.

అయితే మోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. ఇక తాజాగా స్పందించారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. మోదీ తీసుకున్న సాగు చట్టాల నిర్ణయాన్ని స్వాగతిస్తామని ఆయన తెలిపారు. కానీ ఇదే నిర్ణయం ముందే తీసుకుని ఉంటే చనిపోయిన రైతుల ప్రాణాలు దక్కేవని నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక చనిపోయిన మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించటంతో పాటు రైతులపై ఉన్న కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి సుచించారు.