ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయుధంగా జగన్ పై పవన్ కళ్యాణ్ అటాక్!

jagan pawan kalyan

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను టార్గెట్‌ చేయడంలో స్పీడ్‌ పెంచారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌. భారీగా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టు పెడుతున్నారంటూ సోషల్‌ మీడియాలో పవన్‌కళ్యాణ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే మాజీ కాంగ్రెస్‌ నేత, ప్రస్తుత రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలను సమర్థిస్తూ ఉండవల్లి మాట్లాడిన మీడియోను పవన్‌కళ్యాణ్‌ ఫేస్‌బుక్‌, ట్వీట్టర్‌ ఖాతాల్లో పోస్టు చేశారు.

ఉండవల్లి లాంటి రాజకీయ ఉద్ధండులు ఈ మాట మాట్లాడుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు అంటూ పోస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దైయనీయ స్థాయికి దిగజారిపోయిందని, రాష్ట్రం ఏర్పడిన 1956 తర్వాత ఇంతటి దైయనీయ స్థితి ఎప్పుడు లేదని ఉండవల్లి పేర్కొన్నారు. జీఓలు ఆన్‌లైన్‌లో పెట్టకుండా, పాలనలో పారదర్శకత లేకుండా చేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.