ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నెల్లూరు టీడీపీ ఇంఛార్జ్

Nellore Tdp Cbn Ycp Ap

ఏపీలో బుధవారం వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని అధిక పీఠాలను కైవసం చేసుకుంది. ఇక దీంతో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ అధిక స్థానాలు గెలుచుకుని చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. ఇక మరో విషయం ఏంటంటే..? నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఫలితాల్లో కూడా టీడీపీకి నిరాశే మిగిలింది.

ఇక్కడ 49,50 వార్డులకు గాను టీడీపీకి ఇంఛార్జ్ గా పని చేశారు కప్పెర శ్రీనివాసులు. అయితే ఎన్నికలకు ముందు ఈ రెండు వార్డుల్లో గనుక టీడీపీ ఓడిపోతే అరగుండు, అరమీసం గీయించుకుంటానంటూ శపథం చేశాడు. అయితే తాజాగా వెలువడిన ఫలితాల్లో టీడీపీ ఓడిపోవటంతోనే ఇచ్చిన మాట నిలబెట్టుకుని అరగుండు, అరమీసం తీయించుకున్నాడు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు గెలిచేంత వరకూ అరగుండు, అరమీసంతోనే ఉంటానని ఇంఛార్జ్ శ్రీనివాసులు తెలిపారు.