అసెంబ్లీ పరిణామాలపై చంద్రబాబు భార్య భువనేశ్వరి సంచలన లేఖ!

Chandrababu Naidu Wife letter - Suman TV

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. గత కొన్ని నెలులుగా అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య బూతుల పర్వం కొనసాగుతూనే ఉంది.ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో చంద్రబాబు కలత చెందారు. ఇది కౌరవ సభ అంటూ.., మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాకనే సభలో అడుగు పెడతా అని శపథం చేశారు. ఆ తరువాత ప్రెస్ మీట్ లో బాబు కన్నీరు పెట్టుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేని తన భార్యని అవమానిస్తునారని బాబు ఆవేదన చెందారు.

ఇక అప్పటి నుండి టీడీపీ శ్రేణులు, నందమూరి కుటుంబం, కార్యకర్తలు, పరిశ్రమలో కొన్ని వర్గాలు.. బాబు కుటుంబానికి అండగా నిలబడ్డారు. అయితే.., ఈ విషయంలో మొదటిసారి చంద్రబాబు భార్య భువనేశ్వరి స్పందించారు. ఈ విషయంలో ఆమె తాజాగా ఓ బహిరంగ లేఖని విడుదల చేయడం విశేషం.

Chandrababu Naidu Wife letter - Suman TV“ఏపీ శాసనసభలో జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. రాజకీయాల్లో ఇలాంటి పరిస్ధితిలను ఎప్పుడూ చూడలేదు. ఈ సమయంలో నాకు అండగా నిలబడి స్పందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇలాంటి అవమానం ఏ ఆడవారికి జరగకూడదు. మా నాన్న గారు మమ్మల్ని విలువలతో పెంచారు. ఇప్పటికీ మేము ఆ విలువలను పాటిస్తూనే ఉన్నాము. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎవ్వరూ మాట్లాడకూడదు అని భువనేశ్వరి ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.