మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి మహిళా పోలీసు వార్నింగ్!

vice president swarnalatha

టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి గురించి పరిచయం అవసరం లేదు. రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన అయ్యన్న.. అప్పుడప్పుడు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అయ్యన్న.. పలు సందర్భాల్లో పోలీసులపై సంచలన కామెంట్స్ చేశారు. ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. తాజాగా.. ఆయన పోలీసులను బట్టకు ఊడదీసి కొట్టాలంటూ నోరు జారారు. దీంతో.. ఇప్పుడు అయ్యన్న పై మహిళా పోలీస్ అధికారిణి స్వర్ణలత సీరియస్ అయ్యారు. మీడియా ముందుకి వచ్చిన స్వర్ణలత అయ్యన్నపాత్రుడు కామెంట్స్ కి దీటైన సమాధానం ఇచ్చారు.

అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు పోలీసు వ్యవస్థను అవమానపరిచేలా ఉన్నాయి. మీరు మాట్లాడే మాటలకు మూడు సింహాలు తలదించుకుంటున్నాయి. పోలీసులు ఏమి పీకుతున్నారు అని అడిగారు? వరదల్లో గల్లంతైన వారిని కాపాడుతూ ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి విధులు ముగించుకుని వెళ్తూ యాక్సిడెంట్‌లో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. ఇది సార్ మేము. ప్రాణాలు పోతున్నా మా బాధ్యత నిర్వర్తిస్తున్నాము.

ఇలాంటి మమ్మల్ని గుడ్డలు ఊడదీసి కొడతారా? బట్టలూడదీసి కొట్టడం.. పరిగెత్తిచ్చి కొట్టడం ఇలాంటివన్నీ మాకు ట్రైనింగ్‌లోనే నేర్పిస్తారు కాబట్టి.. కాస్త జాగ్రత్త మాట్లాడాలంటూ హెచ్చరించారు. మీ మాట తీరు గనుక ఇంకా మారకుంటే ప్రజలు మిమ్మల్ని బట్టలూడదీసి కొట్టే రోజులు వస్తాయని స్వర్ణలత హెచ్చరించారు. ప్రస్తుతం స్వర్ణలత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. అయ్యన్నకి హెచ్చరికలు చేసిన ఈ మహిళా పోలీస్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.