టీడీపీ ఆరోపణ: 2019 లో కారుకూడా లేదు.. ఇప్పుడు రూ. 5 కోట్ల ప్రైవేట్ విమానంలో ఏపీ మంత్రి..!

గత కొంత కాలంగా ఏపిలో రాజకీయంగా రగడ కొనసాగుతుంది. అధికార పక్షమైన వైసీపీ నేతలు.. ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. దీనికి సోషల్ మీడియా వేధికగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరు పక్షాలు ఏ విషయంలోనైనా తగ్గేదే లే అన్నట్టుగా సాగుతోన్నాయి. తాజాగా రాష్ట్ర అటవీ, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇప్పుడు దీనిపై కూడా విమర్శలు చెలరేగుతున్నాయి.

srinivasa1 compressedరష్యాకు వెళ్లిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ప్రత్యేక జెట్ విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోను తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు.”‘సాకులు వెతుక్కోకుండా జీవించండి. హాయిగా పర్యటించండి (లివ్ లైఫ్ విత్ నో ఎక్స్క్యూజ్స్.. ట్రావెల్ విత్ నో రిగ్రెట్)’’ అంటూ ఓ క్యాప్షన్ను ఆ చిత్రానికి జోడించారు. దీనిపై ఇప్పుడు టీడీపీ నేతలు.. సోషల్ మాద్యమాలను వేదికగా చేసుకొని.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై  సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

2019 లో ఎన్నికల అఫిడవిట్ లో తనకు సొంత కారు కూడా లేదని చెప్పిన మంత్రి బాలినేని.. ఈ రోజు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేటు విమానం బుక్ చేసుకుని రష్యా కి ఎలా వెళ్లారంటూ.. ఆయనను ‘హవాలా కింగ్’గా పోలుస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మూడేళ్ళ క్రితం వరకు కారు కూడాలేని వ్యక్తికి ఇప్పుడు ఇంత హంగూ.. ఆర్భాటాలు ఎక్కడ నుంచి వచ్చాయి? ఇన్ని కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి తెలుగు దేశం పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఆ మద్య చెన్నైకి పెద్ద ఎత్తున ‘బ్లాక్ మనీ’ తరలిస్తూ పట్టుబడ్డ వాహనం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిదేనంటూ టీడీపీ ఆరోపించిన విషయం తెలిసిందే.. ఈ విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. దానికి బదులుగా బాలినేని ఆయన వర్గీయులు టీడీపీ నేతలకు కౌంటర్ కూడా ఇచ్చారు. ఇలా ఇరు పక్షాల మద్య మాటల యుద్దం సాగిన నేపథ్యంలో.. ఇప్పుడు మంత్రి బాలినేనిపై టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తిగా మారింది. మరి.. దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.