హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల ప్రత్యర్థి ఇతనేనా?

అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయింది. ఈటల రాజీనామా విషయంలో ఎలాంటి ఆలస్యం జరగలేదు. ఈ శనివారం ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన ఈటల.., అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఈటల అందచేయడం విశేషం. సో.., ఇక్కడ రెండు విషయాలలో క్లారిటీ వచ్చేసింది. ఈటల రాజీనామాకి స్పీకర్ ఆమోదం లభించడం, ఈటల ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరడం ఖాయం అయిపోయింది. కాబట్టి.., హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక కూడా ఖాయం అయినట్టే. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నిలబడనుండగా, ఈటల మీదకి తెరాస ఏ అస్త్రాన్ని వదలనుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ముల్కనూర్ సహకార బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయంలో గులాబీ అధిష్ఠానం ఇప్పటికే కొన్ని లెక్కలను కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

etela1 compressedహుజూరాబాద్ నియోజకవర్గంలో 2.05లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో సగానికి పైగా బీసీలు. ఇక 40 వేలకు పైగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఉన్నారు. హుజూరాబాద్ నియోజవర్గంలో ఈటల కాకుండా.., మరో బీసీ నేత టి.ఆర్.ఎస్ కి లేరు. దీంతో.., రెడ్డి సామాజిక వర్గ ఓట్ల కోసం టి.ఆర్.ఎస్ వివాదరహితుడైన ప్రవీణ్‌రెడ్డిని రంగంలోకి దింపే ఆలోచన చేస్తుందట. ప్రవీణ్‌రెడ్డి తండ్రి అల్గిరెడ్డి కాశీవిశ్వనాథ్రెడ్డికి హుజూరాబాద్ నియోజకవర్గంలో మంచి సానుభూతి ఉండటం కలిసొచ్చే అంశం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవీణ్‌రెడ్డి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇవన్నీ కూడా ప్రవీణ్‌రెడ్డి అనుకూలమైన అంశాలుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏదైనా ఇతర కారణాలతో ప్రవీణ్‌రెడ్డికి ఈ అవకాశం చేజారితే.., మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పోటీలో తరువాత స్థానంలో ఉన్నారు. మరి.., త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపములో తెలియచేయండి.