Home రాజకీయాలు 2జీ మొబైల్స్ ను విసిరి పారేయండి.. అంబానీ హాట్ కామెంట్స్

2జీ మొబైల్స్ ను విసిరి పారేయండి.. అంబానీ హాట్ కామెంట్స్

Mukesh Ambani on 2g mobiles

ప్రస్తుతం టెలికం మార్కెట్ ను జియో శాసిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాదాపు 27 కోట్ల 4జీ కస్టమర్ లతో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలో నష్టాలు లేని ఏకైక కంపెనీగా రిలయన్స్ జియో అవతరించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జియో రూ.2520 కోట్ల నికర లాభాలను ఆర్జించగా, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.891 కోట్లును రాబట్టుంది. అంటే సగటున 183 శాతం వృద్ధి నమోదైనట్టు లెక్క.దేశంలో 2జీ సేవలు మొదలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముకేశ్‌ అంబానీ మాట్లాడారు.

ప్రపంచ దేశాలన్నీ 5జీ టెక్నాలజీ తో పోటీపడుతున్న సందర్భంలో భారత్ లో ఇంకా 2జీ సేవలు కొనసాగడం ఎంతో కలచి వేసిందని అన్నారు. దేశంలో ఇప్పటికీ ఇంకా 30 కోట్ల మంది 2జీ ఫీచర్‌ఫోన్‌ వినియోగదారులు ప్రాథమిక ఇంటర్నెట్‌ సేవలకు కూడా దూరంగానే ఉన్నారని ముకేశ్‌ అంబానీ వివరించారు. అందువల్ల సత్వరం 2జీ సేవల నిలిపివేతకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. 2జీ సేవల తక్షణమే నిలిపివేయాలని తమ సంస్థ ప్రభుత్వానికి విన్నవించనుంది అని తెలిపారు. 1995 నుండి దేశంలో మొబైల్ సేవలు ఎంతో పురోగతి సాధించాయని గుర్తు చేశారు.

ప్రారంభంలో ప్రతి ఫోన్ కాల్ కు నిమిషానికి రూ.16 కాల్‌ అందుకున్నవారు నేడు జియో రాకతో 4జీ కాల్స్‌ ఉచితంగా చేసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు.మొబైల్‌ వచ్చాకే ‘ఎక్కడి నుంచి ఎక్కడికైనా’ సమాచార సేవలు లభిస్తున్నాయని గుర్తు చేశారు. ‘ధనిక-పేద’ మధ్య తేడా లేని సేవలు అందించడంలో మొబైల్‌ టెలిఫోనీని మించిన సాంకేతికత సాధనం ఏదీ రాలేదని వివరించారు. వచ్చే ఏడాది చివరినాటికి జియో తన సొంత 5జి నెట్ వర్క్ సేవలను ప్రారంభిస్తుందని అన్నారు. ఇటువంటి తరుణంలో 2జీ సేవలకు పుల్ స్టాప్ పెట్టి వలసిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలను చూస్తున్నట్లయితే రానున్న కాలంలో 2జీ సేవలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తుంది. వినియోగదారులకు సరికొత్త సేవలను అందించడానికి రిలయన్స్ జియో సంస్థ ఇప్పటి వరకు 14 డీల్స్ కుదుర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.33,737 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది గూగుల్. ఇది జియో చేసిన 14వ డీల్. రిలయెన్స్ జియోలో 9.99 శాతం వాటా కోసం రూ.43,574 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకుంది. 2జీ సేవలు నిలిచిపోయినట్టు అయితే భారతీ ఎయిర్టెల్ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి అవకాశం ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad