15 ఏళ్ల మైనర్ బాలుడు, పక్కింటి భార్య కనిపించకుండా పోయిన ఘటన తాజాగా గుడివాడలో చోటు చేసుకుంది. ఒకే రోజు ఇద్దరు కనిపించకుండా పోవడంతో బాలుడి తల్లిదండ్రులు ఖంగారుపడి అటు ఇటు అంతా వెతికారు. ఎంత వెతికినా తమ బాలుడి జాడ కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలుడు, పక్కింటి భార్య మిస్సింగ్ అయిన ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని గుడివాడ టౌన్ పరిధిలోని గుడ్ మేన్ పేట కాలనీ. ఇదే ప్రాంతంలో చిన్నరాజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి 15 ఏళ్ల సుందర్ రాజ్ కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఈ నెల 19న రాజ్ కుమార్ సాయంత్రమైన ఇంటికి రాలేదు. దీంతో ఖంగారుపడ్డ తల్లిదండ్రులు వారి గ్రామంతో పాటు బంధువుల ఇళ్లల్లో వెతికారు. ఎంత వెతికినా కూడా ఆ బాలుడి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇలా బాలుడి ఆచూకి కోసం వెతుకున్న క్రమంలోనే వీరి పక్కింట్లో ఉంటున్న 2 పిల్లలు ఉన్న వివాహిత కూడా కనిపించకుండా పోయింది.
ఇక వెంటనే ఆ బాలుడి తల్లిదండ్రులకు అనుమానమొచ్చి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అయితే ఈ మహిళ డబ్బు కోసమే ఆ బాలుడిని అపహరించుకుపోయిందా? లేక మరేదైన కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టడంతో పాటు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా వీరిద్దరి ఆచూకి కనిపెట్టిన వారికి బాలుడి తల్లిదండ్రలు నుంచి తగిన పారితోషికం అందిస్తామని పోలీసులు తెలిపారు. ఇదే అంశం స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. అయితే ఒకే రోజు మహిళతో పాటు 15 ఏళ్ల బాలుడు కనిపించకుండపోవడంతో దీని వెనకాల ఏదైనా బలమైన కారణం దాగి ఉందా అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.