కరోనా కల్లోలం నుండి బయట పడటానికి ప్రపంచదేశాలు అన్నీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో అందరికీ ఆశాజనకమైన మార్గం కనిపించింది వ్యాక్సినేషన్ ఒక్కటే. ఈ విషయంలో అమెరికా, యూకే వంటి దేశాలు కాస్త త్వరగా చర్యలు తీసుకుని అక్కడ వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం చేశాయి. దీనితో.. ఇప్పుడు ఆయా దేశాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. కానీ.., మన దేశంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర వ్యాక్సినేషన్ కాస్త ఆలస్యంగా మొదలైంది. దీనితో ఇప్పటికీ సరిపడా డోస్ లను మనం సమీకరించుకోలేకపోతున్నాము. 136 కోట్ల మంది జనాభాకి వ్యాక్సిన్ అందటం కాస్త కష్టమైన పనే. కాకుంటే… ఈ పక్రియ ఇంకా ప్రాధమిక దశలోనే ఉండటం కాస్త ఆశ్చర్యాన్ని, ఆందోళనని కలిగిస్తోంది. ఇప్పటికీ కనీసం 20 కోట్ల మందికి కూడా రెండు డోస్ లు పూర్తిగా అందలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.., మొదటి డోస్ వేయించుకున్న వారిలో చాలా మందికి ఇంకా సెకండ్ డోస్ అందటం లేదు. వారందరికీ సెకండ్ డోస్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మరి.., మొదటి డోస్ వేయించుకుని, సెకండ్ డోస్ వేయించుకోలేకపోతున్న వారి బాడీలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అనుకున్న సమయంలో సెకండ్ డోస్ ఇవ్వకపోతే బాడీలో ఫస్ట్ డోస్ శక్తి తగ్గిపోతుందేమోనన్న ఆందోళన చాలా మంది ప్రజల్లో ఉంది. కానీ.., ఇది ఎంత మాత్రం నిజం కాదు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదట డోస్ వేసుకున్నాక బాడీ యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి. వ్యాక్సిన్ లో ఆల్రెడీ ఉండే డెడ్ సెల్స్ పై అవి దాడి చేస్తాయి. ఆ తరువాత మిగతా వైరస్ ఏదయినా బాడీలోకి వస్తే ఫైట్ చేయడానికి యాంటీ బాడీస్ సిద్ధంగా ఉంటాయి. తరువాత ఇచ్చే సెకండ్ డోస్ జస్ట్ బూస్టప్ లాంటిది. ఇది ఆలస్యం అయినంత మాత్రాన బాడీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. పైగా..,సెకండ్ డోస్ ఇవ్వడానికి ఇదే నిర్దిష్టమైన గడువు అంటూ ఏమి లేదు. కెనడా వంటి దేశాల్లో తొలి డోస్ వేయించుకున్న తర్వాత 16 వారాలకు సెకండ్ డోస్ వేస్తున్నారు. అందువల్ల సెకండ్ డోస్ ఆలస్యం అయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.