హూ ఈజ్ విక్రమాదిత్య.. ప్రభాస్ బర్తడే రోజు రాధేశ్యామ్ సర్ ప్రైజ్ గిఫ్ట్

ఫిల్మ్ డెస్క్- రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తరువాత రాధే శ్యామ్ మూవీతో రాబోతున్నారు. జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రాధే శ్యామ్ రూపుదిద్దుకుంటోంది. తెలుగుతో పాటు పలు బాషల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. వచ్చే సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14న రాధే శ్యామ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలకు సిద్దమవుతోంది.

అందాల భామ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అన్నట్లు రాధే శ్యాణ్ మూవీలో సినీయర్ నటుడు కృష్ణంరాజు ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. రాధే శ్యామ్ విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు నిర్మాతలు. ఈ క్రమంలో డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే సందర్బంగా అభిమానులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మేకర్స్.

l21stpq8 radhye

హూ ఈజ్ విక్రమాదిత్య పేరుతో రాధే శ్యామ్ మూవీ లోని ప్రభాస్ పాత్రను పరిచయం చేయబోతున్నారట. గత సంవత్సరం పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా రాధే శ్యామ్ నుంచి ప్రేరణ పాత్రను ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభాస్ లుక్ తో ఓ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఈ క్రమంలో ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఉదయం 11 గంటల 16 నిమిషాలకు రాధే శ్యామ్ టీజర్ ను అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా రాధే శ్యామ్ మేకర్స్ ప్రకటించారు. ఇంకేముంది ప్రభాస్ బర్త్ డే రోజు అభిమానులకు డబుల్ ధమాకా అన్నమాట.