నువ్ నన్ను వదిలేసి వెళ్లిపోయావ్.. బాగా మిస్ అవుతున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్

స్పెషల్ డెస్క్- మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్నాక ఇటు మెగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, అటు అపోలో ఆస్పత్రి బాధ్యతలను చూసుకుంటోంది ఉపాసన. అందుకే మెగా కుటుంబంతో పాటు, కామినేని కుటుంబాల్లో ఉపాసనది ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. ఇక కొణిదెల ఉపాసన సోషల్ మీడియాలా చాలా యాక్టీవ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తమ రెండు కుటుంబాలకు సంబందించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది ఉపాసన. తాజాగా తన సోదరి అన్షుపాల పుట్టిన రోజు సందర్భంగా ఉపాసన బర్త్ డే విషెస్ చెప్పింది. అన్షుపాల కామినేనికి సెప్టెంబర్ 12న అర్మాన్ ఇబ్రహీంతో వివాహాం జరిగింది. ప్రస్తుతం అన్షుపాల హైద్రాబాద్‌ నుంచి వెళ్లిపోయి చెన్నైలో ఉంటోంది. దీంతో ఉపాసన తన చెల్లెలు అన్షుపాలను హాగా మిస్ అవుతోందట.

upasana kamineni konidela 1

తన ప్రియమైన సోదరికి బర్త్ డే విషెస్ చెబుతూ ఎంతగా మిస్ అవుతుందో తెలియజేసింది ఉపాసన. ఈమేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన ఉపాసన ఏంచెప్పిందంటే.. నాకు ఎంతో ఇష్టమైన సోదరి అన్షుపాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నా బలం, నాకు నిజమైన ఆత్మబంధువు.. నువ్ ఈ ఏడాది నన్ను వదిలేసి చెన్నైకి వెళ్లిపోయావ్.. నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను.. ఎంతో బాధగా ఉంది.. అని పోస్ట్ లో చెప్పింది ఉపాసన.

అంతే కాదు.. కానీ నువ్ సంతోషంగా ఉన్నందుకు నాకింకా హ్యపీగా ఉంది.. మనం దెబ్బలాడుకున్న ప్రతీసారి ఇంకా ఎంతో దగ్గరయ్యాం, బలంగా మారాం.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. అని భావోద్వేగంతో చెప్పుకొచ్చింది ఉపాసన. ఇంకేముంది ఇన్ స్టాగ్రామ్ లో ఉపాసన పెట్టిన పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. మోగా అభిమానులు సైతం అన్షుపాలకు బర్త్ డే విషేస్ చెబుతున్నారు.