వణికిపోతున్న పైవేట్ హాస్పిటల్స్ అధినేతలు! కోట్లు మింగారు! ఇప్పుడు కక్కుతున్నారు!

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకరిని దోచుకోవాలని చూస్తే.., ఆ కర్మ ఫలం అనుభవించక తప్పదు. కరోనా ట్రీట్మెంట్ పేరుతో నిన్న మొన్నటి వరకు లక్షలకి లక్షలు ఫీజులు వసూల్ చేసిన ప్రైవేట్ హాపిటల్స్ అధినేతలు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వాటికి కరోనా ట్రీట్మెంట్ కి పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడంతో ఆ అధినేతలు లబోదిబో అంటున్నారు. నిజానికి కరోనాకి సరైన ట్రీట్మెంట్ అంటూ ఏది లేదు. ఏదో ఉన్న మెడిసిన్స్, ఇంజక్షన్స్, స్టెరాయిడ్స్ ఇచ్చి డాక్టర్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రాణాల మీదకి వచ్చే సరికి ప్రజలు కూడా హాస్పిటల్స్ కి బారులు తీరుతున్నారు. కానీ.., అసలు ట్రీట్మెంట్ లేని కరోనాకి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లక్షలకి లక్షలు బిల్స్ వేశాయి. వారం రోజులకే రూ.25 లక్షల పైగా బిల్స్ వసూల్ వేశారు. కానీ.., ఇన్ని ఇన్ని లక్షలు ఖర్చు చేసినా పేషంట్ బతుకుతాడా అంటే గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలోనే కార్పొరేట్ హాస్పిటల్స్ చేస్తున్న కరోనా దందాపై సీఎం కేసీఆర్ కన్నెర్ర చేశారు. దీంతో.., రాష్ట్ర వ్యాప్తంగా 25కి పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ పై వేటు పడింది. రోజుకి లక్షల్లో ఆదాయం వచ్చే ఈ సీజన్ లో పర్మిషన్ క్యాన్సిల్ అవ్వడం, ఈ హాస్పిటల్స్ పై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో వాటి అధినేతలు ఇప్పుడు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావును కలుస్తున్నారు.

bil 2డీహెచ్ కార్యాలయానికి తాజాగా కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ఈ సందర్భంగా తాము అంతా బాగా వ్యవహరించినట్లు వారు చెప్తున్నా, వారి మాటలకు భిన్నంగా పేషెంట్లు దాఖలు చేసిన బిల్లులు ఉండటంతో అధినేతల నోట మాట రావడం లేదట. షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకుని.., కరోనా ట్రీట్మెంట్ కి అనుమతులు ఇవ్వాల్సిందిగా వీరంతా డీహెచ్ కార్యాలయం ఎదుట పడిగాపులు ఖాయడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఇక ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ విషయంలో తాజాగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీరిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూనే.., ఇప్పటి వరకు పేషంట్స్ నుండి అధికంగా వసూల్ చేసిన బిల్స్ రీఫండ్ చేపించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో.., ఇంత కాలం సంపాదించిన కోట్ల డబ్బుని ఎక్కడ వెనక్కి తిరిగి ఇవ్వాల్సి వస్తుందో అని ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అధినేతలకి నిద్ర పట్టడం లేదట. అవసరం అయితే వీరంతా కలసి న్యాయస్థాన్ని కూడా ఆశ్రయించాలన్న నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తోంది. మరి.., ప్రజలను వైద్యం పేరుతో దోచుకున్న కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఇలాంటి స్థితి రావడంపై ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.