Kamal Haasan: విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘విక్రమ్’ మూవీ సక్సెస్ ని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత కమల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తూ రూ. 400 కోట్లకు పైగా వసూల్ చేసింది. అదీగాక ఈ ఏడాది కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో నిలవడం విశేషం. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందించిన విక్రమ్ మూవీ కమల్ కెరీర్లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
ఇక విక్రమ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న కమల్ కి తాజాగా తమిళనాడు ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ప్రభుత్వం కమల్ కి నోటీసులు పంపడానికి కారణం ఏంటని ఆరాతీస్తే.. చెన్నైలో రెండో దశ మెట్రో పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆళ్వార్ పేటలోని కమల్ ఇంటి నుంచే మెట్రో వెళ్లనుందట. ఆ స్థలంలో మెట్రో స్టేషన్ నిర్మాణం కోసం 170 చదరపు అడుగులు కావాలని.. తమిళనాడు ప్రభుత్వం కమల్ కు నోటీసులు పంపినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వం అడిగిన స్థలంలో కమల్ కి సంబంధించిన ‘మక్కల్ నీది మయ్యమ్’ ఆఫీస్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ నిర్మాణ సంస్థ ఆఫీసులు ఉన్నాయట. అయితే.. ఈ వ్యవహారంపై ఇప్పటివరకూ ఇటు కమల్ హాసన్, అటు స్టాలిన్ ప్రభుత్వం నేరుగా స్పందించకపోవడం గమనార్హం. మరి కమల్ స్వచ్ఛందంగా మెట్రో కోసం ప్రభుత్వం అడిగిన సదరు స్థలాన్ని ఇస్తారో లేదో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Kamal Haasan’s house to be taken over by government? Official notice stirs speculations #KamalHaasan𓃵 #Vikram #MNM #cmrl https://t.co/J8eQHxyPDx
— IndiaGlitz – Tamil (@igtamil) July 3, 2022