చనిపోయాడని ఫ్రీజర్ లో పెట్టారు.. పోస్ట్ మార్టమ్ చేస్తుంటే ఒక్కసారిగా

dead man in the morgue

ఉత్తర్ ప్రదేశ్- ఈ ప్రపంచంలో ఒక్కోసారి భలే విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి మనం అస్సలు నమ్మలేని ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. మనం నమ్మవేకపోయినా మన కళ్లముందు సాక్షాత్సరిస్తుంటే మనం మాత్రం ఏంచేయగలం చెప్పండి. అందరితో పాటు మనం కూడా నోరెల్లబెట్టడం తప్ప. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగి ఓ ఘటన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

అసలేం జరిగిందంటే.. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని హాస్పిటల్ కు తీసుకెళ్లగా, అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని తెల్చేశారు. ఇంకేముంది అతని డెడ్​ బాడీని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రిలోని మార్చూరి గదిలోని ఫ్రీజర్​ లో పెట్టారు అతని డెడ్ బాడీనీ. కేసు విచారణ కోసం వచ్చిన పోలీసులు, కుటుంబ సభ్యుల సమక్షంలో డెడ్ బాడీని పరిశీలిస్తుండగా అతడు కదిలినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని డాక్టర్లకు చెప్పడంతో వెంటనే అతడిని ఐసీయులోకి తీసుకెళ్లి వైద్యం అందించారు.

Freezer 1

ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్​ లోని మొరాదాబాద్​ లో శనివారం చోటుచేసుకుంది. శ్రీకేశ్ కుమార్ అనే వ్యక్తికి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో, బంధువులు శుక్రవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఐతే అతను అప్పటికే చనిపోయాడని నిర్ధారించిన డాక్టర్లు పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని బంధువులకు సూచించారు. దీంతో శ్రీకేశ్ డెడ్ బాడీని సర్కార్ దవాఖానాకు తరలంచగా, అక్కడ రాత్రంతా దాదాపు 6 గంటల పాటు మార్చురీ ఫ్రీజర్​లో ఉంచారు.

తెల్లవారుజామున పంచనామాకు పోలీసులు, కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు అతను బతికే ఉన్నట్లు గమనించారు. ఏ మాత్రం అలస్యం చేయకుండా అతడిని ఆస్పత్రి ఐసీయులోకి షిఫ్ట్ చేసి ట్రీట్​ మెంట్ ప్రారంభించారు వైద్యులు. శ్రీకేశ్ ఇంకా కోమాలో ఉన్నాడని తేల్చిన డాక్టర్లు, బతికే ఉన్న మనిషిని చనిపోయినట్లు ఎలా నిర్ధారిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. మొత్తానికి శ్రీకేశ్ బతికే ఉండటంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అంతే లేదు.