వాట్సాప్ స్టేటస్ లో ప్రియురాలి నగ్న వీడియో

సూర్యపేట- ప్రేమ పేరుతో సమాజంలో దారుణాలు జరగుతున్నాయి. ప్రేమించిన వారి కోసం ఏమైనా చేసే రోజుల నుంచి ప్రేమించిన వారినే అబాసు పాలు చేస్తున్న ఘటనలు చాలా వెలుగుచూస్తున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, ఆమె నగ్న వీడియోను చిత్రీకరించిన యువకుడు, దాన్ని ఏకంగా తన వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టాడు.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలంలోని శ్రీనివాసపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన దళిత బాలిక ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన జింకల సైదులు కుమారుడు మహేశ్‌, కోదాడలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మహేశ్‌, నాలుగు నెలల క్రితం బాలికకు వీడియో కాల్‌ చేసి నగ్నంగా కనిపించాలని కోరాడు. తాను ప్రేమించిన వ్యక్తే కదా అని ఆమె అలాగే చేసింది. ఆ వీడియో కాల్‌ ను మహేశ్‌ తవ మొబైల్ ఫోన్ లో సేవ్‌ చేసి పెట్టుకున్నాడు. ఇటీవల బాలికను గ్రామంలో స్కూటీ నడపవద్దని, తాను చెప్పినప్పుడు తనవద్దకు రావాలని, లేదంటే వీడియోను బయట పెడతానని హెచ్చరించడం మొదలుపెట్టాడు.

whatsup 1

ఐతే తాను రాలేనని, పొలం పనులు ఉన్నాయని ఆ బాలిక చెబుతూ వస్తోంది. ఈ విషయంపైనే బాలికతో మహేశ్‌ ఐదు రోజుల క్రితం గొడవపడ్డాడు. బాలికపై పగ కోపం పెంచుకున్న మహేష్ ఈ నెల 10న 19 సెకన్ల నిడివి గల బాలిక నగ్న వీడియోను తన వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టాడు. బాలిక స్నేహితులు ఆ వీడియో గురించి చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ తింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తల్లిదండ్రులకు విషయం చెప్పింది.

తన తల్లిదండ్రులతో కలిసి మహేశ్‌ ఇంటికి ముందు ఆందోళనకు దిగింది. దీంతో మహేశ్‌ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. మహేశ్‌ సైతం పరారీలో ఉన్నాడు. దిక్కుతోచని స్థితిలో మరుసటి రోజు బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులు హుజూర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహేశ్‌పై పోలీసులు అట్రాసిటీ, అత్యాచారం, ఐటీ, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మహేశ్‌ నమ్మించి గత రెండేళ్లుగా శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాలిక చెప్పింది. తనకు న్యాయం జరిగే వరకూ మహేశ్‌ ఇంటి ముందు నుంచి కదలబోనని స్పష్టం చేసింది. బాలికను పెళ్లి చేసుకునేందుకు మహేశ్‌ నిరాకరిస్తున్నాడు. యువకుడి ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న బాలిక వద్దకు కోదాడ డీఎస్పీ రఘు వెళ్లి వివరాలు సేకరించారు.