సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భర్త భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హుజర్ నగర్ మండలం మర్రిగూడెం గ్రామంలో గొట్టెముక్కల గోపయ్య, వెంకటమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా ఓ కుమారుడు గతంలోనే మరణించాడు. అయితే భర్త గోపయ్య కొన్నాళ్ల క్రితం గ్రామాన్ని వదిలి చెన్నై వెళ్లిపోయాడు.
అప్పటి నుంచి వెంకటమ్మ కుమారుడి వద్దే ఉండేది. అయితే చెన్నై వెళ్లిన భర్త గోపయ్య ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. ఇక శుక్రవారం గోపయ్య భార్య వెంకటమ్మను మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ గొడవ చేశాడు. దీంతో భార్య వెంకటమ్మ లేవనే సమాధానమిచ్చింది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త గోపయ్య భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో వెంకటమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తిగా కాలిపోయిన శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.