హుజూర్ నగర్‌కు చెందిన సుంకి సురేందర్ రెడ్డి ఒంగోలు గిత్తలను పెంచుతున్నారు. వాటికి భారీగా డిమాండ్ ఉండడంతో ఏపీ వాసికి విక్రయించాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి హైదరాబాద్‌లో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు.
మన పెద్దలు వ్యవసాయం చేసేందుకు పశువులను ఉపయోగించేవారు. వ్యవసాయం తోపాటుగా పశుపోషణ కూడా చేసి నిత్య జీవితంలో పశువులను అవసరాలకు ఉపయోగించుకునేవారు. పొలం దున్నడానికి, అరక కొట్టడానికి, పొలానికి పెంట కొట్టడానికి, పండిన పంటను మార్కెట్లకు తరలించేవారు. ఎడ్ల బండ్లపై ధాన్యాన్ని మార్కెట్లకు తరలించేవారు. ఎక్కడికైనా ప్రయాణాలు, అత్యవసరాలకు వెళ్ళవలసి వచ్చినపుడు ఎడ్ల బండ్లు వాడేవారు. యాంత్రీకరణ పెరిగిన కొద్ది పశువుల ఉపయోగం తగ్గింది. లేకపోతే ఒకప్పుడు ప్రతి ఇంట్లో జత ఎడ్లు ఉండేవి. పాలిచ్చే గేదెలు, ఆవులు కూడా ఉండేవి. కానీ ప్రస్తుత కాలంలో అలా లేదు. పోషణ భారంగా ఉండడం, వ్యవసాయ పనులకు ట్రాక్టర్లు వాడడంతో ఎడ్లను వాడకం తగ్గిపోయింది.
అయినా సరే కొందరు పశువులపై ఇన్‌ట్రస్ట్ ఉన్నవారు వాటిని పెంచి పోషిస్తున్నారు. అయితే హుజూర్ నగర్ కు చెందిన సుంకి సురేందర్ రెడ్డి తన గౌరవ ప్రతిష్టలకు సూచికలుగా ఒంగోలు జాతికి చెందిన గిత్తలను పెంచాడు. వాటిని ఏపీ వాసికి అమ్మాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. సుంకి సురేందర్ రెడ్డి సొంత ఊరు హుజూర్ నగర్, తను హైదరాబాద్‌లో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు. వారిది వ్యవసాయ కుటుంబం. ఆయనకు పశుపోషణ చాలా ఇష్టం. దీంతో హుజూర్ నగర్‌లో పందెపు గిత్తలను పెంచుతున్నారు. ఎడ్లతోపాటుగా కోళ్లు, కుక్కలు, పక్షులను కూడా పెంచుతున్నారు. తాజాగా అతని దగ్గర ఉన్న పందెపు గిత్తలు ఒక జత అమ్మాడు.
వాటిని ఏపీ వాసికి చెందిన వ్యక్తి కొనుగోలు చేశాడు. ఒంగోలు జాతి గిత్తల జత కోసం ఆ రైతు ఏకంగా కోటి రూపాయలు చెల్లించాడు. వీటిలో ఒక గిత్త రేటు రూ. 70 లక్షలు అంటున్నారు. వాటిని భీముడు, అర్జునుడు అనే పేర్లతో పిలిచేవారు. ఈ ఎడ్లు పందెంలో పాల్గొంటే పతకం కొట్టడం ఖాయమంటున్నారు. దాదాపు 9 నెలల నుండి 40 పోటీల్లో పాల్గొన్న ఆ జోడి గిత్తలు.. 34 సార్లు మొదటి ఫ్రైజ్ గెలుచుకున్నాయి. అందుకే బేరం కుదిరిన మరుసటి రోజే కోటి రూపాయలను చెల్లించారు. ఒంగోలు గిత్తలు కోటి రూపాయలు పలకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒంగోలు గిత్తలు బండలు, బరువులు లాగే పోటీల్లో పాల్గొంటాయి. బ్రీడింగ్ కోసం కూడా ఈ గిత్తలను ప్రత్యేకంగా పెంచుతున్నారు. వీటి పోషణ ఖరీదైన విషయమే. తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందెన్నడు ఇంత ధర పలకలేదు.