రంజాన్ మాసం సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్!

టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా మార్పులు వస్తున్నాయి. ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా పలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. టీఎస్‌ ఆర్టీసీకి మంచి హైప్ ఇస్తున్నారు సజ్జనార్‌. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ప్రయాణికుల నుంచి వచ్చే వినతులు, విజ్ఞప్తులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించేందుకు పలు సంస్కరణలను తీసుకొస్తున్నారు. ప్రతి పండుగ సందర్భంగా కొత్తకొత్త డిస్కౌంట్లను ప్రవేశపెడుతున్నారు. రంజాన్ సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త ప్రకటించింది.

ఇది చదవండి: రాజమౌళి గురించి 12 ఏళ్ల క్రితం నేను చెప్పిందే నిజమయ్యింది: నటుడు

image 1 compressed 122కార్గో సర్వీసు చార్జీలపై 25 శాతం డిస్కౌంట్ ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా వెల్లడించారు. రంజాన్ సందర్భంగా కార్గో, పార్సిల్ ఛార్జీల్లో 25 శాతం రాయితీ ప్రకటించారు. అయితే ఈ నెల 24 నుంచి మే 3 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వివరించారు. ప్రయాణికులు మరిన్ని వివరాలకు 040-30102829, 68153333 నంబర్లను సంప్రదించాలని సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘పవిత్ర రంజాన్‌ పండగ సందర్భంగా మీ ప్రియమైన వారితో కనెక్ట్‌ అవ్వండి. వారికి ఇష్టమైన దుస్తులు, బహుమతులు, స్వీట్లు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌, సేమ్యా, ఖర్జూరాలు తదితర వస్తువులు ఆర్టీసీ ద్వారా పంపించండి. హ్యాపీ రంజాన్‌..’ అని అందులో ఆయన రాసుకొచ్చారు. తాజాగా ప్రకటించిన ఈ 25 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌‌కు ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.