ఆర్టీసీని ఆర్థిక పథం వైపు అడుగులు పెట్టించేందుకు టీఎస్ఆర్టీసీ మరో వినూత్న ఆలోచన చేసింది. ఇప్పటికే పలు పథకాలు చేపట్టిన తెలంగాణ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. ప్రయాణీకులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే ఈ ఆఫర్ లభించనుంది. రానున్నదీ శుభకార్యాలు, పండుగలు, పెళ్లిళ్లు నేపథ్యంలో ప్రయాణీకులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు రాయితీలను ఇస్తున్నట్లు పేర్కొంది. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే ఈ ఆఫర్ లభించనుంది.
ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే.. 31 రోజుల నుండి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణీకులకు టికెట్ లో 5 శాతం రాయితీ ఇస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. 46 రోజుల నుండి 60 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆన్ లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసింది. ముందస్తు రిజర్వేషన్ ఉన్న సర్వీసులన్నీంటికీ ఈ రాయితీ వర్తిస్తుందని ప్రకటించింది. రానున్నదీ శుభకార్యాల సమయం నేపథ్యంలో ప్రయాణీకులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. ఆర్టీసీ అందిస్తున్న ఈ ఆఫర్ ను వినియోగించుకుని సంస్థను ఆదరించాలని కోరారు.
ఆర్టీసీ ఆఫర్లను టీఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన ఎండిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రవాణా సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు. రవాణా, లాజిస్టిక్ సేవలతో పాటు, జీవా వాటర్ వంటి సేవలు, ఆర్టీసీలో ప్రయాణించాలని సూచించడంతో పాటు నష్టాలకు కారణమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణీకుల కోసం టీఎస్ఆర్టీసీ తీసుకుంటున్న ఈ చర్యల పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ప్రయాణికులకు #TSRTC శుభవార్త చెప్పింది. ముందుస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి రాయితీలను ప్రకటించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే టికెట్‌లో 5 శాతం రాయితీ కల్పించింది. 46 రోజుల నుంచి 60 రోజుల ముందు చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. pic.twitter.com/8MFv00ctAT
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) February 1, 2023