వాడిని ఎన్‌కౌంటర్ చేస్తాం.. మీడియా ముందే మంత్రి మల్లారెడ్డి వార్నింగ్!

దేశంలో మహిళలపై వరుస అత్యాచారాలు.. హత్యల పరంపర కొనసాగుతుంది. కామాంధులు చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తమ గుట్టు రట్టు అవుతుందని.. వారిని దారుణంగా చంపేస్తున్నారు. హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్, అత్యాచారం, హత్య చేశాడు ఓ కామాంధుడు.

leadere minఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితుడు రాజుని ఎన్ కౌంటర్ చేస్తామని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, సైదాబాద్‌ సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన ఆరేళ్ల బాలిక కుటుంబాన్ని కాంగ్రెస్‌, మజ్లిస్‌, బీఎస్పీ నేతలు పరామర్శించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మజ్లిస్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రి, బీఎస్పీనేత ప్రవీణ్‌కుమార్‌ బాలిక కుటుంబ సభ్యులను కలిశారు. నటుడు మంచు మనోజ్ చిన్నారి కుటుంబ సభ్యులను కలిశారు.

baby min 4నాలుగైదు రోజులు గడుస్తున్నా మంత్రులు పరామర్శించకపోవడం అధికార పార్టీ నేతలు పరామర్శించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని మీడియా ప్రశ్నించగ.. మంత్రి మల్లారెడ్డి స్పందించారు. చిన్నారి హత్యాచార ఘటన ఘోరమన్నారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని.. ఎన్‌కౌంటర్ చేస్తామంటూ హెచ్చరించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. నూతన టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడుతూ మల్లారెడ్డి ఈ వాఖ్యలు చేశారు.